BigTV English

Duvvada Srinivas: ప్రేయసి, భార్య మధ్య చిచ్చుపెట్టి.. జంపైన దువ్వాడ

Duvvada Srinivas: ప్రేయసి, భార్య మధ్య చిచ్చుపెట్టి.. జంపైన దువ్వాడ

Duvvada Srinivas Family Controversy: వేర్ ఈజ్ దువ్వాడ? అటు ఇల్లాలు, ఇటు ప్రియురాలి మధ్య పోరు పెట్టి.. మెల్లగా తప్పించుకున్నారా? టెక్కలిలో రచ్చ రచ్చ అవుతుంటే.. ఆయన సైలెంట్‌గా ఎక్కడున్నారు? ప్రజా ప్రతినిధి అయి ఉండి.. ప్రజల మధ్య తిరగలేని పరిస్థితి తెచ్చుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటు.. ఇంటిపోరు తారస్థాయికి చేరింది.


రోజుకో మలుపుతో దువ్వాడ కుటుంబ వివాదం టాక్ ఆఫ్ ఏపీ అవుతోంది. భార్య భర్తల మధ్య గొడవగా మొదలైన ఈ ఇష్యూ.. ఇప్పుడు శ్రీనివాస్ ఇంటి చుట్టూ తిరుగుతోంది. ఆయన ప్రస్తుతం ఉంటున్న ఇంటిని దివ్వెల మాధురికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఈ వార్ పీక్స్‌కి చేరుకుంది. రిజిస్ట్రేషన్‌ చేయడంతో వాణీ శనివారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. చివరికి ఒత్తి చేతుతోనే వెనుదిరిగామే.

రాత్రి జరిగిన రచ్చకు మాధురి ఆదివారం ఉదయం లాయర్‌లో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతం తను ఉన్న ఇల్లు తన హక్కు అని గట్టిగా చెప్పారామే. అంతేకాదు.. ప్రెస్ మీట్‌లోనే దువ్వాడ శ్రీనుకు కాల్ చేసి మాట్లాడించారు. గతంలో మాధురి దగ్గర 2 కోట్లు తీసుకున్నానని.. అందుకే.. తన ఇంటిని ఆమెకు రిజిస్ట్రేషన్ చేశానన చెప్పారాయన. ఎవరి బలవంతం లేకుండా ఇష్ట పూర్వంగానే ఆమెకు ఇచ్చేశానని క్లారిటీ ఇచ్చారు.


తన ఆస్తిలోకి అనుమతి లేకుండా ఎవరు ఇంట్లోకి వచ్చినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు మాధురి. ఇంటిని కబ్జా చేయడానికి వాణి ప్రయత్నం చేశారని ఆమె ప్రధాన ఆరోపణ. యాక్సిడెంట్ టైంలో బయటకు వచ్చిన వాయిస్ కూడా వాణి క్రియేషనేనని చెప్పుకొచ్చారు.

Also Read: నా భర్తతో విడిపోతా.. శ్రీను నేను కలిసి ఈ ఇంట్లోనే.. మాధురి షాకింగ్ కామెంట్స్

దువ్వాడ ఇంటి కోసం ఓ వైపు మాధురి, మరోవైపు వాణీ నువ్వా నేనా అన్నట్టు పోరాటం చేస్తుంటే.. మధ్యలోకి చింతాడ పార్వతీశం అనే రిటైర్డ్ టీచర్ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వివాదంలో ఉన్న ఇంటి నిర్మాణానికి తాను డబ్బు ఇచ్చానని ఆయన చెబుతున్నారు. ఆ డబ్బు ఇవ్వకపోతే ఎంతవరకైనా వెళ్తానని వార్నింగ్ ఇచ్చారు పార్వతీశం.

ప్రస్తుతం మాధురి లీగల్‌గా శ్రీనివాస్ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఇక వాణి నెక్స్ట్ స్టెప్ట్ ఏంటి అనేది ఉత్కంఠగా మారింది. రిటైర్డ్ టీచర్ పార్వతీశం న్యాయ పోరాటం చేస్తారా? దానికంటే ముందే దువ్వాడ ఆయన న్యాయం చేస్తారా అనేది తేలాలి. అయితే.. ఇన్ని జరుగుతున్నా శ్రీనివాస్ మాత్రం ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×