BigTV English

Car Accident in Adilabad: సరదాలో విషాదం.. టైరు పేలి లోయలోపడిన కారు, ఆ తర్వాత..

Car Accident in Adilabad: సరదాలో విషాదం.. టైరు పేలి లోయలోపడిన కారు, ఆ తర్వాత..

Car Accident in Adilabad: కారులో హాయిగా ముచ్చట్లు చెబుతూ ఓ ఫ్యామిలీ వస్తోంది. ఒక్కసారిగా ఏమైందో తెలీదు…పెద్ద శబ్దం రావడంతో వారంతా పెద్ద లోయలో పడిపోయారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగిందన్న లోతుల్లోకి ఒక్కసారి వెళ్దాం..


తెలంగాణలో భారీ వర్షాలు పడడంతో జలపాతాల్లో  నీటి ప్రవాహం జోరందుకుంది. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్రలోని నాందేడ్‌కి చెందిన ఆరుగురు సభ్యుల ఓ ఫ్యామిలీ.. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతాన్ని చూసేందుకు బయలుదేరింది.

ALSO READ: ఆ ఎమ్మెల్యేలపై అనర్హత.. హైకోర్టు సంచలన తీర్పు


కారులో హాయిగా కబుర్లు చెబుతూ వస్తోంది ఆ ఫ్యామిలీ.  వాహనం మహారాష్ట్ర బోర్డర్ దాటింది. తెలంగాణ సరిహద్దుల్లోకి కారు వచ్చేసింది. మరో అరగంటలో కుంటాల జలపాతం వద్దకు చేరుకోనుంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ ప్రాంతం వద్దకు రాగానే నేషనల్ హైవేపై అకస్మాత్తుగా కారు టైరు పేలిపోయింది.

స్పీడ్‌కు ఒక్కసారిగా 50 అడుగుల లోయలో పడింది కారు. సమీపంలోని స్థానికులు ఈ ఘటనను చూసి వెంటకే లోయలోకి దిగారు. వారిని కారు నుంచి బయటకు తీసి కూర్చోబెట్టారు. వివరాలు తెలుసుకుని వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

లోయ నుంచి వారిని బయటకు తీసి అంబులెన్స్‌లో నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారంతా కోలుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? అనేదానిపై బాధితుల నుంచి ఆరా తీశారు.

 

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×