E-Paper
Advertisement

Chiranjeevi Donate to Janasena: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లో తెలుసా..?

Chiranjeevi Donate to Janasena: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లో తెలుసా..?
Advertisement
Chiranjeevi - Pawan Kalyan
Chiranjeevi – Pawan Kalyan

Chiranjeevi Donation to Janasena Party: జనసేన పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ఇచ్చారు. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బీజీగా మెగాస్టార్ చిరంజీవిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాగబాబు వెళ్లి కలిసారు.

హైదరాబాద్ నగర శివారులో ముచ్చింతల్ లో విశ్వంభర షూటింగ్ జరుగుతుండగా చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు వెళ్లి కలిశారు. అయితే జనసేన విజయాన్ని కాంక్షిస్తూ మెగాస్టార్ రూ.5 కోట్ల విరాళం అందించారు. దానికి సంబంధించిన చెక్ లను చిరు జనసేనానికి అందజేశారు.

Advertisement

చిరంజీవి ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వెనుక నేనున్నాంటూ చిరంజీవి భరోసా ఇచ్చారు. ఆ తర్వాతం మెగా సోదరులు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రచార హోరు, తదితర అంశాల గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Love Mouli Trailer: నవదీప్ బోల్డ్ కంటెంట్.. అర్జున్ రెడ్డికి మరో వెర్షన్ లా ఉందే..

Advertisement

“అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×