BigTV English

CM Revanth Reddy: కొడంగల్‌పై కుట్రలు జరుగుతున్నాయి.. నన్ను కిందపడేయాలని చూస్తున్నారు

CM Revanth Reddy: కొడంగల్‌పై కుట్రలు జరుగుతున్నాయి.. నన్ను కిందపడేయాలని చూస్తున్నారు
CM Revanth Reddy Speech In Kodangal Tour
CM Revanth Reddy Speech In Kodangal Tour

CM Revanth Reddy Speech in Kodangal Tour: కొడంగల్‌లో తనని కింద పడేయాలని కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని.. 75 ఏళ్లలో కొడంగల్‌కు ఎవరూ చేయని అభివృద్ధి చేశానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.


కొడంగల్‌కు తాను మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్ ప్రాంతాన్ని 4 వేల కోట్ల రూపాయలతో నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును తీసుకొచ్చానని తెలిపారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చారా అని బీజేపీ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణను సీఎం ప్రశ్నించారు. కొడంగల్ ను అభివృద్ధి చేయనీయొద్దని డీకే అరుణ కుట్ర చేస్తున్నారన్నారు.


Also Read: మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు వెయ్యి కోట్లు ఆదా..

“అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకా? రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

పదేండ్లల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొడంగల్ లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చిందా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని స్పష్టం చేశారు.

ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని.. పదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. పదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీ మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా అని మండిపడ్డారు.

Also Read: KCR Fake Promises: కేసీఆర్‌తో అట్లుంటది మరి..

“మనల్ని దెబ్బ తీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు.. కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం. నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే. కొడంగల్‌ను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. నాతో కొట్లాడే హక్కు మీకుంది. పట్టు పట్టి పని చేయించుకునే అధికారం మీకుంది. రాష్ట్రానికే నాయకత్వం వహించే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50వేల మెజారిటీ అందించాలి. కొడంగల్ పై జరిగే కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి.” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×