Temple Employee: ఏపీలోని ఓ ఉద్యోగి మద్యం తాగి దేవాలయంలో విధులకు హాజరైనట్లు తెలుస్తోంది. భక్తులు అతడిని గుర్తించి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. క్యూ కంపార్టు మెంటులో గురువారం రాత్రి 9 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకున్నది.
అనంతరం పలువురు భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉన్నతాధికారి అక్కడికి చేరుకుని వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటుంటే ఏం చేస్తున్నారంటూ వారిని భక్తులు నిలదీశారు. ఆలయ పవిత్రతను కాపాడే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ వారు మండిపడ్డారు.
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పంపిణీ
ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారింటి ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన విషయమై తెల్లవారుజామున భక్తులు ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు.