BigTV English

Paris Olympics 2024: ఆమెనా? అతడా?.. పోటీ పడలేక వైదొలగిన మహిళా బాక్సర్

Paris Olympics 2024: ఆమెనా? అతడా?.. పోటీ పడలేక వైదొలగిన మహిళా బాక్సర్
Advertisement

Imane khelif in Paris Olympics(Latest sports news today): పారిస్ విశ్వ క్రీడల్లో విభిన్న రూల్స్ ఉంటాయి. అందువల్ల కొన్నిచోట్ల నిషేధాలకు గురైన వారు ఒలింపిక్స్ లోకి వచ్చి ఆడుతుంటారు. అలా పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ 66 కేజీల ప్రిక్వార్టర్స్ మ్యాచ్ జరుగుతోంది. అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్ తో ఇటలీకి చెందిన ఏంజెలా కెరానీ పోటీ పడింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే చిన్న సమస్య వచ్చింది.


ఇటలీకి చెందిన ఏంజెలా కెరానీ సడన్ గా పోటీ ప్రారంభమైన 46 సెకన్లలోనే బౌట్ నుంచి తప్పుకుంది. కారణం ఏమిటంటే ప్రత్యర్థి ఖెలీఫ్ కొట్టిన పంచ్ చాలా ఫోర్స్ గా తగిలిందని తెలిపింది. ముక్కు నుంచి రక్తం కూడా కారింది. నా కెరీర్ లో ఇంత బలమైన పంచ్ ఎదుర్కోలేదని తెలిపింది. దీంతో ఖెలీఫ్ లో పురుషల లక్షణాలు అధికంగా ఉన్నాయనే ప్రచారం నెట్టింట మొదలైంది. వైరల్ గా మారింది.

నిజానికి బరిలో ఉన్న అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలీఫ్ పై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య వేటు వేసింది. ఎందుకంటే ఆమెలో ఎక్స్ వై క్రోమోజోమ్స్, టెస్టోస్టిరాన్స్ పురుషుల స్థాయిలో ఉన్నాయని డీఎన్ఏ పరీక్షల్లో తేలింది. కానీ విశ్వ క్రీడలకు వచ్చేసరికి కొన్ని నిబంధనల్లో సడలింపులు ఉంటాయి. ఆ కారణంగానే ఖెలీఫా బాక్సింగ్ బరిలోకి వచ్చింది.


Also Read: ఒకటి కొట్టిన స్వప్నిల్ కి కోటి నజరానా.. మరి రెండు కొట్టిన మను బాకర్ కి సున్నా..

అమ్మాయిల బాక్సింగ్ లో పురుష లక్షణాలున్న వారిని ఎలా ఆడిస్తారని ఎక్స్ (ట్విటర్) సీఈవో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించాడు. దీంతో దీనిపై నెట్టింట వాడీవేడీ చర్చ మొదలైంది. ఈ సందర్భంగా పోటీ నుంచి తప్పుకున్నా ఏంజెలా కన్నీళ్లతో మాట్లాడుతూ తను కొట్టిన పంచ్ కి నా ముక్కు పగిలి రక్తం కారుతోంది. ఇంత గట్టి దెబ్బను నా కెరీర్ లోనే చూడలేదు.అందుకే బౌట్ ను ఆపేశాను. ఎవరు? ఏమిటి? అని చెప్పడానికి నేనిక్కడకు రాలేదు. ఆడటానికి మాత్రమే వచ్చానని చెప్పింది.

దీంతో ఈ వివాదం మళ్లీ ఒలింపిక్స్ కమిటీలో తెరపైకి వచ్చింది. ఇప్పుడు రాబోవు మ్యాచ్ ల్లో ఖెలీఫాతో ఆడిస్తారా? లేక తనని తప్పిస్తారా? మరి ఏంజెలా తరహాలోనే అందరూ తప్పుకుంటే, చక్కగా ఖెలీఫాకు బంగారు పతకం ఇచ్చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. అయితే పలువురు ఖెలీఫాకు మద్దతు తెలుపుతున్నారు. ఆ దేవుడి సృష్టి ఇది…ఇలా తనని అవమానించడం భావ్యం కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

Virat Kohli: కోహ్లీ ట్వీట్‌పై వివాదం.. డ‌బ్బుల మ‌నిషి అంటూ ఫ్యాన్స్ తిరుగుబాటు !

Kohli: గంభీర్, అగ‌ర్కార్‌ బొచ్చు కూడా పీక‌లేరు…రిటైర్మెంట్‌పై కోహ్లీ వివాద‌స్ప‌ద పోస్ట్ !

LSG – Kane Williamson: సంజీవ్ గోయెంకా తెలివి త‌క్కువ నిర్ణ‌యం…అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కేన్ మామ కోసం పాకులాట ?

EngW vs PakW : పాకిస్థాన్ కొంప‌ముంచిన వ‌ర్షం..వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఎలిమినేట్‌, పాయింట్ల ప‌ట్టిక ఇదే

PAK VS SA: లాహోర్ లో క‌ల‌క‌లం…పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూంలో దూరిన ఆగంత‌కుడు

MS Dhoni: నాకు కొడుకు కావాల్సిందే..ధోనిని టార్చ‌ర్ చేస్తున్న‌ సాక్షి ?

IPL 2026: ఐపీఎల్ 2026 లో పెను సంచ‌ల‌నం…ఢిల్లీ, KKRకు కొత్త కెప్టెన్లు?

Commonwealth Games 2030 : 2030 కామన్‌ వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..అసలు వీటికి ఆ పేరు ఎలా వ‌చ్చింది

Big Stories

×