BigTV English

Ex cm ys jagan: జగన్ సెక్యూరిటీ ఖర్చు నెలకు అంతా? ఇది దారుణం

Ex cm ys jagan: జగన్ సెక్యూరిటీ ఖర్చు నెలకు అంతా? ఇది దారుణం

Ex CM YS Jagan for personal security(Andhra politics news): వై నాట్ వన్ సెవంటీ ఫైవ్ అంటూ ఊదరగొట్టి 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకున్నారు వైఎస్ జగన్. అధికారంలో ఉండగా పిల్లి పాలు తాగినట్లు తమని ఎవరూ పట్టించుకోవడం లేదు కదా అని కొందరు రాజకీయ నాయకులు ప్రవర్తిస్తుంటారు. అత్యధిక మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు అండ్ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం లో జరిగిన అవకతవకలపై విచారణ మొదలెట్టాయి. జగన్ అవినీతి ఆరోపణలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాయి. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. ఇంకా మరికొందరు లైన్ లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా విలాసాలకు ఖర్చుపెట్టేశారు గత పాలకులు. ఏపీలో అందినకాడికి అప్పులు చేసి ఖజానా ఖాళీ చేశారు. కొత్తగా వచ్చిన చంద్రబాబు సర్కార్ ఈ ఆర్థిక లోటును ఎలా పూడ్చాలో అర్థం కాని పరిస్థితిలో తలలు బాదుకుంటున్నారు. అయితే ఇటీవల జగన్ సర్కార్ నిర్వాకం గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది.


నెలకు ఆరు కోట్లు

కేవలం జగన్ భద్రత కోసం ఏకంగా నెలకు రూ.6 కోట్లు ఖర్చుపెట్టారని సమాచారం. దాదాపు వెయ్యి మంది పోలీసు సిబ్బందిని ఆయన పర్సనల్ గా సెక్యూరిటీ కోసం నియమించుకున్నారట. ఇదంతా అధికారికంగా అయితే జగన్ ప్రైవేటు సైన్యం కోసం అదనంగా రూ.50 లక్షలకు పైగా ఖర్చుచేశారట. ఇది కూడా గవర్నమెంట్ ఖర్చుల అకౌంట్ లోనే జమ అయ్యేలా చేశారు. ఒక దేశ ప్రధానికి కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు అని రాజకీయ మేధావులు విమర్శిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్,ముఖ్యమంత్రి నివాసం వద్ద దాదాపు 48 చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు, బ్యారికేడ్లు ఏర్పాట్లు చేసుకుని సామాన్యులెవరినీ ముఖ్యమంత్రిని కలుసుకోనీయకుండా చేశారు. జగన్ భద్రత కోసం ఆక్టోపస్ కమాండోస్ తో తాడేపల్లి ప్యాలెస్ కు ప్రత్యేక భద్రత కల్పించుకున్నారు. అలాగే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ డ్రోన్లతో నిఘా కెమెరా వ్వవస్థ ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరిపించారు. పగలు రాత్రి కూడా డ్రోన్ల్ ల ద్వారా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 24 గంటలూ డ్రోన్లతో పర్యవేక్షణ జరిగేది. ఇక మనుషులెవరూ లోనికి ప్రవేశించకుండా 30 అడుగుల ఎత్తులో ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారు.


లోటస్ పాండ్, ఇడుపుల పాయ

కేవలం తమ కుటుంబ సభ్యుల కోసమే ఏకంగా 400 మందితో ప్రత్యేక సెక్యూరిటీ బృందాన్ని ఏర్పాటు చేసుకోవడంపై సర్వత్రా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. తాను పదవిలో ఉండగా ఈ స్థాయి సెక్యూరిటీని ఏ ముఖ్యమంత్రీ కూడా ఏర్పాటు చేసుకోలేదని ఓ సీనియర్ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కు సైతం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా ఈ స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదు అని జనవ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా సెక్యూరిటీ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు జగన్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లి లోనే కాదు..హైదరాబాద్ లోటస్ పాండ్ లో, ఇడుపుల పాయ ప్యాలెస్ వద్ద, పులివెందులలో తన నివాసం వద్ద అనధికారికంగా భద్రతా సిబ్బందితో ఏర్పాట్లు చేసుకున్న జగన్ వారందరి జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వ అకౌంట్ లోనే జమచేయడం గమనార్హం. ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్ చర్చగా నడుస్తోంది.

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×