BigTV English

Indian Olympian Archana Kamath: సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ స్టార్

Indian Olympian Archana Kamath: సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ ప్రకటించిన ఒలింపిక్ స్టార్

Archana Kamath decided to quit Table Tennis(Sports news today): టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అర్చనా కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. యూఎస్‌లో ఉన్నత విద్య చదివేందుకు అర్చనా కామత్..24 ఏళ్లకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది.


అయితే పారిస్ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత తన కెరీర్‌పై కోచ్ అన్షుల్ గార్గ్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు.  ఆర్థిక అవసరాలు, నాలుగేళ్ల తర్వాత జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో పతకం సాధించే అవకాశాలు తక్కువగా ఉండడంతో అకడమిక్ కెరీర్‌లో ముందుకు సాగడం కోసం ఆటను వదిలిపెట్టినట్లు ఆమె కోచ్ వెల్లడించారు.

పతకం సాధించడం చాలా కష్టమైన పనే అని చెప్పానని, ఆమె ప్రపంచ 100 ర్యాంకుల జాబితాలో లేదన్నారు. గత రెండు నెలలుగా ఆమె ఎంతో కష్టపడుతున్నప్పటికీ..ప్రొఫెషనల్ కెరీర్ కోసం మరింత కఠోర శ్రమ అవసరమని వెల్లడించినట్లు చెప్పారు. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య చదవాలని నిర్ణయించుకున్నట్లు కోచ్ వివరించారు.


ఇటీవల పారిస్‌లో జరిగిన పారా ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ మహిళల భారత జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ రికార్డును చేరుకోవడంలో 24 ఏళ్ల అర్చనా కామత్ కీలక పాత్ర పోషించింది. ఇంతలో అర్చనా సంచలన నిర్ణయం తీసుకోవడంతో క్రీడాభిమానులు షాక్‌కు గురయ్యారు.

Also Read: కబాలీ.. ఫోజిచ్చిన పంత్.. అర్థమేంటి?

ఇదిలా ఉండగా, పారిస్ ఒలింపిక్స్‌కు ఆమెను సెలెక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయన్నారు. కానీ విమర్శలు తిప్పికొడుతూ ఒలింపిక్స్ లో మెరుగైన ప్రదర్శన కనబర్చిందని కోచ్ వెల్లడించారు. క్వార్టర్ ఫైనల్ లో భారత జట్టు 1-3 తేడాతో జర్మనీ చేతిలో ఓటమి పాలైంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×