E-Paper
Advertisement

Ex Minister Balineni: తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షల పందెం కాసా : ఏపీ మాజీ మంత్రి

Ex Minister Balineni: తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షల పందెం కాసా : ఏపీ మాజీ మంత్రి
Advertisement

Ex Minister Balineni: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన ఆయన తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసినట్లు వెల్లడించారు. ఇప్పుడివే కామెంట్స్ హాట్ గా మారాయి. మరో వ్యక్తి తెలంగాణ లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడన్నారు. కానీ కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసినా.. తాను పందాన్ని రద్దు చేసినట్లు బాలినేని వెల్లడించారు .

అంతే కాదు రాజకీయాలపైన ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే విరక్తి పుడుతోందన్నారు బాలినేని. అంతే కాదు ఈనాటి రాజకీయాలు అన్నీ కుల ప్రాతిపదికగా జరగుతున్నాయన్నారు. అలాగే మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నట్లు బాలినేని వెల్లడించారు. తాను అన్నీ నిజాలే మాట్లాడతానన్న బాలినేని.. డబ్బులు తీసుకున్న విషయాన్ని కూడా బయట పెట్టారు. లేనిపక్షంలో రాజకీయాలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు తనకు సినిమాలపై ఇష్టం ఉండేదని, సినిమా తీయాలని కోరికగా ఉండేదన్నారు. ఇప్పుడు సినిమాల వైపే వెళ్లాలని ఉందని, ఇక్కడ ప్రజలు తనను కావాలనుకుంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. సీఎం జగన్ అంటే తనకు చాలా ఇష్టమన్న బాలినేని.. ఏపీలో మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×