E-Paper
Advertisement

Vijayasai Reddy: హిందూ మతంపై కుట్రలు.. విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

Vijayasai Reddy: హిందూ మతంపై కుట్రలు.. విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Advertisement

Vijayasai Reddy: వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటన సంచలనం అవుతున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ ఎప్పుడూ విమర్శించలేదన్న ఆయన తాజాగా హిందూ మతం సంచలనం ట్వీట్ చేశారు.

‘హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం ధర్మం కోసం హిందువులలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష’ అని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

మతమార్పిడి వీడియోపై పోస్ట్

Advertisement

హిందువులను మతమార్పిడి చేస్తున్నారంటూ ఓ యూట్యూబర్ చేసిన వీడియోను విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అంతే కాకుండా హిందూమతంపై కుట్రలు సహించేది లేదని పేర్కొన్నారు. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే, అటువంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామన్నారు. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై ప్రభుత్వం విచారించాలని డిమాండ్ చేశారు.

భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష అంటూ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. విజయసాయి రెడ్డి ఇప్పటికే వరకూ హిందూమతంపై బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేయలేదు. తాజా ప్రకటనపై నెట్టింట చర్చ మొదలైంది. ఏదైనా రాజకీయ ఉద్దేశంతో విజయసాయి ట్వీట్ చేశారా? అని చర్చించుకుంటున్నారు.

గత పదేళ్లు అంటే?

Advertisement

గత పదేళ్లలో అని విజయసాయిరెడ్డి ట్వీట్ లో ప్రస్తావించారు. అంటే గత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల సమయంలో మత మార్పిడిలు ఎక్కువగా జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని ఆయన ఉద్దేశం అయి ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయి రెడ్డి కీలకంగా వ్యవహారించారు. వైసీపీ ఎంపీగా పనిచేశారు. జగన్ అధికారంలో రావడానికి విజయసాయి రెడ్డి పాత్ర కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చి విజయసాయి రెడ్డి.. ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

Also Read: Vizag News: తెలుగువారి పరువు తీశారు.. తక్షణమే రాజీనామా చేయి, గుడివాడ అమర్నాథ్ డిమాండ్

బీజేపీకి చేరువయ్యేందుకేనా?

జగన్ చుట్టూ ఉన్న కోటరీ తనను ఆయనకు దూరం చేసిందని విజయసాయి రెడ్డి చెబుతున్నారు. ఇక రాజకీయాల్లోకి దూరం అంటూ చెబుతూనే.. తరచూ రాజకీయ ప్రకటన చేస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటానని, తాను ఒక రైతు అంటూ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఇంతలోనే తన అవసరం ఉందనుకుంటే తప్పకి రీఎంట్రీ ఇస్తానని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ను తానెప్పుడూ విమర్శించలేదని చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ మతాల గురించి మాట్లాడని ఆయన.. సడెన్ గా మత మార్పిడి గురించి మాట్లాడటంతో ఆయన బీజేపీలోకి వెళుతున్నారా? అనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. విజయసాయి బీజేపీలో చేరుతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×