Srikalahasti: శ్రీకాళహస్తిలో అర్థరాత్రి దాదాపు అరగంటపాటు రణరంగం చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఇరువర్గాల వారు దాదాపు అరగంటపాటు ఇరువర్గాలు కత్తులు, కర్రలు, ఇనుప రాడ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
శ్రీకాళహస్తి పట్టణంలో ద్రౌపది సమేత ధర్మరాజులస్వామి అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమం జరిగింది. కార్యక్రమం తర్వాత మంచినీళ్ల గుంటకు చెందిన రోహిత్,ధనుష్- వీఎంపల్లికి చెందిన భానుకిరణ, చరణ్‌ల ఆదివారం రాత్రి మద్యం మత్తులో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు రెండు గ్రూపుల మధ్య తీవ్రరూపం దాల్చింది.
తొట్టంబేడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ద్విచక్ర వాహనంలో వస్తున్న రోహిత్ , ధనుష్‌లను అడ్డుకుని భాను,చరణ్,కిరణ్‌లు దాడి చేశారు. ఈ ఘటనలో రోహిత్, ధనుష్‌లకు గాయాలు అయ్యాయి. గాయపడినవారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు వారి స్నేహితులు సుధాకర్, మునిరత్నం, ముని రాజాలు.
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిపై మరొకసారి దాడి చేసేందుకు కొందరి యువకులతో కలసి భాను,కిరణ్,చరణ్ వచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లతో కొట్టుకున్నారు ఇరువర్గాల వారు. దాదాపు గంట పాటు ఆసుపత్రి ఆవరణం రణరంగంగా మారిపోయింది. రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
ALSO READ: శ్రీశైలంలో సీఎం చంద్రబాబు.. జలహారతి తర్వాత గేట్లు ఓపెన్
ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడ చూసినా రక్తపు మరకలు కనిపించాయి. దాడి ఘటనతో భయపడి ఆసుపత్రి నుంచి రోగులు, నర్సులు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియక సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసుకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈలోగా ఓ వర్గం అక్కడి నుంచి పరారు అయ్యారు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. పాతకక్షలే కారణమని భావిస్తున్నారు. పరారీలో ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. దాడికి సంబంధించి ఆసుపత్రి బయట సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దాడి ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దాడికి ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు డీఎస్పీ నరసింహమూర్తి. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి.
శ్రీకాళహస్తిలో గ్యాంగ్ వార్.. కత్తులు కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి
ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కత్తులు కర్రలు ఇనుప రాడ్లు, రాళ్లతో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ
ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది , పేషెంట్లు భయంతో పరుగులు.
నలుగురికి గాయాలు, కేసు నమోదు చేసిన పోలీసులు. pic.twitter.com/jN4kG8gQh1— ChotaNews App (@ChotaNewsApp) July 7, 2025