Biker OTT: టాలీవుడ్ హీరో శర్వానంద్(శర్వానంద్) ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అనుకున్న విధంగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అయితే తన తదుపరి సినిమాతో హిట్ కొట్టడమే లక్ష్యంగా ఈయన విభిన్న జానర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. శర్వానంద్ హీరోగా డిసెంబర్ 6వ తేదీ బైకర్(Biker) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కడమే కాకుండా ఈ సినిమాలో శర్వానంద్ కూడా విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే, డిజిటల్ హక్కులు అమ్ముడుపోవడం విశేషం. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్(Net Flix) కైవసం చేసుకున్నారు. ఈ సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాల తరువాత డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ డీల్ ప్రకారం డిసెంబర్ 6 తేదీ బైకర్ సినిమా విడుదల అయితే జనవరి మొదటి వారంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులకి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే అధికారకంగా వెల్లడించబోతున్నారు. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా శర్వానంద్ సరసన మాళవిక నాయర్ (Malavika Nayar)హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా కీలకపాత్రలో నటించారు.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఒక గ్లింప్ వీడియో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది ఇక ఈ ఈవెంట్లో భాగంగా డైరెక్టర్ అభిలాష్ సినిమా పట్ల ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ఇప్పటివరకు మీరు చూసిన రేసింగ్ సినిమాల కంటే వన్ పర్సెంట్ ఎక్కువగానే మా సినిమా ఉండబోతుందని తెలిపారు.
బాలయ్యను ఢీ కొట్టబోతున్న శర్వానంద్..
మరి డిసెంబర్ 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది అయితే డిసెంబర్ 5వ తేదీ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా అఖండకు పోటీగా శర్వానంద్ బైకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి బాలయ్యను ఢీ కొట్టి శర్వానంద్ సక్సెస్ అందుకోగలరా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ ఏకంగా చిరంజీవి ప్రభాస్ లతో పోటీ పడబోతున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న శర్వానంద్ ఈసారైనా హిట్ అందుకుంటారా? లేదా వేచి చూడాలి.
Also Read: Bandla Ganesh: బండ్లన్నకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్..కథల వేటలో బిజీగా!