Apple iPhone 18: ఇటీవలే iPhone 17తో మన ముందుకొచ్చిన ప్రముఖ దిగ్గజ సంస్థ యాపిల్.. ఇప్పుడు iPhone 18 సిరీస్ రిలీజ్‌కు సిద్దమవుతోంది. దక్షిణ కొరియాకు చెందిన టెక్ నివేదిక ప్రకారం.. ఆపిల్ నెక్ట్స్ జనరేషన్ iPhone 18 లైనప్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ సిరీస్‌లో సూపర్ స్మార్ట్ ఫీచర్లను చేర్చే అవకాశం ఉందట. ప్రస్తుత ఐఫోన్ మోడల్స్ అయిన ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే.. ఐఫోన్ 18 సిరీస్‌ను 50% వరకు హై మెమరీతో తీసుకువచ్చే అవకాశం ఉందట.
కొన్నిరోజుల క్రితం విడుదలైన.. ఐఫోన్ 17 సిరీస్ 12GB ర్యామ్‌తో వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, స్టాండర్డ్ ఐఫోన్ 17 మోడల్ 8GB ప్టోరేజ్‌తో వచ్చింది. ఇదిలా ఉంటే.. యాపిల్ సంస్థ రాబోయే అన్ని ఐఫోన్ 18 మోడళ్లలో ఒకే టైప్ మెమరీ తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఐఫోన్ 18 కూడా 12GB ర్యామ్‌తో వచ్చే అవకాశం ఉందట. యాపిల్ 12GB, 16GB కాన్ఫిగరేషన్‌లలో హై పర్ఫార్మెన్స్ అందించే LPDDR5X మెమరీ చిప్‌ను అందించాలని శాంసంగ్‌ను కోరినట్లు లీకేజీలను బట్టి తెలుస్తోంది. 2026 లైనప్‌కు తగినంత ర్యామ్ అందించేందుకు కంపెనీ ఎస్‌కే హైనిక్స్, మైక్రాన్‌లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
డిజైన్ పరంగా చూస్తే.. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే ఐఫోన్ 18 సిరీస్ కూడా ఒకే సైజులో, అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌లో ఉండే అవకాశం ఉంది. అయితే, యాపిల్ రిఫ్రెష్ లుక్ కోసం.. బ్లాక్ గ్లాస్‌పై కొత్త ట్రాన్స్‌పరెంట్ ఎండ్‌తో వచ్చే అవకాశం ఉంది. స్టాండర్డ్ ఐఫోన్ 18 చిన్న డైనమిక్ ఐలాండ్‌తో రానుంది. ఐఫోన్ ప్రో మోడళ్లకు ఆపిల్ నెక్ట్స్ జనరేషన్ A20 ప్రో చిప్ కావచ్చు. స్పీడ్ పర్ఫార్మెన్స్, పవర్ సామర్థ్యం, ఆకర్షణీయమైన ఆన్-డివైస్ ఏఐ ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు. రెగ్యులర్ ఐఫోన్ 18లో A20 బయానిక్ చిప్ ఉండవచ్చు. అది కూడా 2nm ప్రాసెస్‌లోనే ఉంటుంది. కెమెరా అప్‌గ్రేడ్‌లు కూడా ఉండొచ్చు. ఐఫోన్ 18లో 48 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండవచ్చు.
తాజాగా వెలువడిన దక్షిణకొరియాకు చెందిన టెక్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 18 సిరీస్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ ధర మాదిరిగానే బేస్ మోడల్‌కు దాదాపు రూ.82,900, ఐఫోన్ ప్రో వెర్షన్ రూ.1,34,900 నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. అయితే, ఇవి ఊహాగానాలు మాత్రమే. స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.