E-Paper
Advertisement

ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన

ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన
Advertisement

Anakapalli: బస్సు ప్రమాదాలు ఏ మాత్రం తగ్గలేదు. రోడ్డు ప్రమాదాలు తగ్గాయని భావించిన సమయంలో.. అగ్నిప్రమాదాలు పెరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా గురువారం అర్ధరాత్రి అనకాపల్లి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో బస్సులోని 35 మంది ప్రయాణికులు ఉన్నారు.

అనకాపల్లి జిల్లాలో ఘటన..  మంటల్లో ట్రావెల్ బస్సు

Advertisement

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలోని జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఓ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తోంది శ్రీ తులసి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో రేగుపాలెం సమీపంలోకి బస్సు వచ్చేసరికి ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, బస్సు ఆపి ప్రయాణికులకు సూచన చేశాడు. వెంటనే ప్రయాణికులంతా వేగంగా కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం కాలిపోయింది. ఘటనలో సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

అప్రమత్తమైన డ్రైవర్..  35 మంది ప్రయాణికులు సేఫ్

బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎలమంచిలి అగ్నిమాపక అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు ఇంజన్‌లో డీజిల్ లీక్ కావడం వల్ల ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది మాట.

ఘటన సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చిన మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత బస్సును పక్కకు తొలగించారు పోలీసులు. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదం నుంచి అందరూ బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.  సంబంధిత ట్రావెల్ సంస్థ  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణికులను తరలించే ప్రయత్నం చేసింది.

ALSO READ: గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని.. వైఎస్ జగన్ డిమాండ్..!

 

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×