BigTV English

Jogi Ramesh’s family: మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరిన్ని కష్టాలు.. ఫ్యామిలీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Jogi Ramesh’s family: మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరిన్ని కష్టాలు.. ఫ్యామిలీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Jogi Ramesh family news(Political news in AP): వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి జోగి రమేష్‌కు కష్టాలు రెట్టింపయ్యాయా? అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఆయన కొంప ముంచుతుందా? జోగి ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సీఐడీ సిద్ధమైందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.


అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో జోగి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. భూముల వ్యవహారంలో ఫోర్జరీ కోణం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. రేపో మాపో జోగి రమేష్ ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతోంది సీఐడీ.

జోగి రమేష్‌కి తాను స్థలం అమ్మలేదని సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారు సంబంధిత వ్యక్తి పోలవరపు మురళీమోహన్. డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు తనవి కావని అంటున్నారాయన. వాస్తవానికి సర్వేనెంబరు 88లో 4 ఎకరాలు వెంటకచలమారెడ్డి పేరుపై ఉంది. అందులో ఓ ఎకరం పోలవరపు మురళీమోహన్, మరొకటి అద్దెపల్లి కిరణ్ కుమార్‌కు.. రెండు ఎకరాలు రామిశెట్టి రాంబాబుకు 2001లో విక్రయించారు.


ALSO READ: పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారిన కొత్త డీపీఆర్ ఆమోదం!

పోలవరపు మురళీమోహన్ తన ఎకరం స్థలాన్ని ప్లాటులుగా విభజించి 2003, 2004లో 11 మందికి విక్రయించాడు. పోలవరపు మురళీమోహన్.. జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్‌‌లకు ల్యాండ్ విక్రయించిన ట్టు రెండేళ్ల కిందట రిజిస్ట్రేషన్లు అయ్యాయి.

దర్యాప్తు అధికారులు పోలవరపు మురళీమోహన్‌ను నిందితుడిగా చేర్చారు. అధికారుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జోగి కుటుంబానికి తాను భూములు అమ్మలేదని, ఆ డాక్యుమెంట్లు తనవి కావని వెల్లడించాడు. అంతేకాదు ఆధార్ కార్డు నెంబరు తన కాదని వివరణ ఇచ్చాడు.

సర్వే చేసే సమయంలో సంబంధిత భూమి సరిహద్దుల్లో ఉన్న యజమానులకు నోటీసులు ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. వీటిపై కూడా ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ లెక్కన జోగి ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.  ఈ యవ్వారంలో తీగ లాగితే డొంక అంతా కదులుతోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×