BigTV English

Stree 2 : స్త్రీ 2 సాంగ్ కోసం తమన్నా అంత రెమ్యునరేషన్ తీసుకుందా ?

Stree 2 : స్త్రీ 2 సాంగ్ కోసం తమన్నా అంత రెమ్యునరేషన్ తీసుకుందా ?

Tamannaah Remuneration for Stree 2 Song(Bollywood news): బాలీవుడ్ లో ఒక ఐటమ్ సాంగ్ ఇప్పుడు బాక్సీఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమాకి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిజానికి ఆ సినిమా ఏమిటంటే, ఆగస్టు 15న విడుదలైన హర్రర్ మూవీ…. స్ట్రీ 2 సినిమా.


ఇంతకీ అందులో ఐటమ్ సాంగ్ చేసిందెవరో కాదు.. తెలుగువాళ్లకి బాగా సుపరిచితమైన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో తమన్నా పాట ఒకటి. ‘రా నువు కావాలయ్యా..నువు కావాలి రా రా రా రా..’ పాట కూడా ఇంతే సంచలనం స్రష్టించింది.

ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తమన్నా ఐటమ్ సాంగ్ షేక్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి స్ట్రీ 1 సినిమాకి సీక్వెల్ గా స్ట్రీ 2 తీశారు. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, ఇతర స్టార్ యాక్టర్లు తిరిగి సీక్వెల్ లో పోషించారు. అయితే శ్రద్ధాకి కూడా లేనంత క్రేజ్ రావడంతో బాలీవుడ్ అంతా తమన్నావైపే ఇప్పడు చూస్తోంది.


ఇంతకీ విషయం ఏమిటంటే, పుష్ప-1లో సమంత చేసిన ’ఊ అంటావా మామా‘ ఐటమ్ సాంగ్ సినిమాకి ఎలా హైప్ క్రియేట్ చేసిందో, ఇప్పుడు స్ట్రీ 2 సినిమాలో తమన్నా పాట ‘ఆజ్ కి రాత్ మజా హుస్న్ కా ఆంఖో సే లిజియే’ పాట అంతకు మించి చేసిందని అంటున్నారు. ఈ ఒక్క పాట కారణంగా వారం రోజుల్లో కలెక్షన్లు రూ.200 కోట్లు దాటేశాయని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. స్ట్రీ 2, హర్రర్ సినిమా ఎలా జనం రిసీవ్ చేసుకుంటారోనని ఆందోళన పడిన మేకర్స్ ని తమన్నా భాటియా ఐటమ్ సాంగ్ ఒడ్డున పాడేసిందని చెబుతున్నారు.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తమన్నా కూడా తక్కువేమీ కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని చక్కగా వంట పట్టించుకుంది. ఆ సినిమా మొదటి పార్ట్ లో ఐటమ్ సాంగ్ చేసిన నోరా ఫతేహి వసూలు చేసిన మొత్తం కన్నా నాలుగింతలు ఎక్కువ వసూలు చేసిందంట.

అయితే మొదటి సినిమా స్ట్రీ 1, 2018లో విడులైంది. ఇప్పుడు రెండో పార్ట్ ఆరేళ్ల తర్వాత అంటే ఆగస్టు 15, 2024లో విడుదలైంది. అందువల్ల రేట్లు పెరిగాయి కాబట్టి, తమన్నా నాలుగింతలు ఆ పాట కన్నా ఎక్కువ వసూలు చేయడం న్యాయమేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్ లో ఒకొక్క ఐటమ్ సాంగ్ కి కోటి రూపాయల చొప్పున వసూలు చేసిన ప్రముఖ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారని అంటున్నారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Saregama India (@saregama_official)

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×