Cyber Crime: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పోలీసులు ఆధార్ వెరిఫికేషన్ ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో నడుస్తున్న అంతర్జాతీయ స్థాయి సైబర్ మోసపు గ్యాంగ్‌ను బహిర్గతం చేశారు. ఈ మోసంలో ఏలూరుకు చెందిన 66 ఏళ్ల మహిళ వకీలు బాధితురాలిగా మారింది. మోసగాళ్లు ఆమె నుంచి దాదాపు రూ. 51.90 లక్షలు స్వాహా చేశారు. ఈ ఘటన గత వారంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ మోసాలు ఎక్కువగా వృద్ధులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ రకం మోసాల్లో భాగమని ఏలూరు డిజిపి రవికృష్ణ రెడ్డి పేర్కొన్నారు.
బాధిత మహిళకు మోసగాళ్లు మొదట ఫోన్ కాల్ చేసి, ఆమె ఆధార్ కార్డ్‌తో క్రిమినల్ యాక్టివిటీల్లో పాల్పడినట్లు బెదిరించారు. వారు ‘డిజిటల్ అరెస్ట్ వారంట్’ అనే తప్పుడు డాక్యుమెంట్‌ను చూపించి, ఆమెను భయపెట్టారు. ముంబై పోలీసు అధికారుల మాదిరిగా వ్యవహరిస్తూ, వీడియో కాల్‌లో ఆమెను ‘అరెస్ట్’ చేశారని చెప్పుకుని, మనీ లాండరింగ్ కేసులో ఆమె పేరు జోడించకుండా డబ్బు ఇవ్వమని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె భయభ్రాంతుల్లో వివిధ బ్యాంక్ అకౌంట్లకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది. మోసగాళ్లు ఆమెకు తప్పుడు FIR, IPS అధికారి ID కార్డులు, అధికారిక సీల్స్‌తో లెటర్లు పంపి, మోసాన్ని నమ్మదగినదిగా చేశారు.
అయితే ఏలూరు సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు విచారణ ప్రారంభించారు. టెక్నికల్ ట్రాకింగ్ ద్వారా మోసం యాప్‌లు, సర్వర్లు చైనా, సింగపూర్, హాంకాంగ్, USAలో ఉన్నట్లు తేలింది. మ్యూల్ అకౌంట్లు బెంగళూరులో ఉన్నాయి. ఈ విచారణలో ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి, సీతాపూర్, బరాబంకీ ప్రాంతాల్లో ఆపరేషన్లు నడుస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా, 11 మంది నిందితులను అరెస్టు చేశారు. వారు పూనం ప్రవీణ్ సోనవాణే (ముంబై), సచింద్ర శర్మ(ఉత్తరప్రదేశ్), నీతిన్ మిశ్రా, హర్షిత్ మిశ్రా, అభిషేక్ కశ్యప్, గోపాల్ యాదవ్(ఉత్తరప్రదేశ్), సందీప్ అలోన్(యవత్మాల్, మహారాష్ట్రలో బ్యాంక్ మేనేజర్), సందీప్ వాక్పంజర్ (పోలీసు కానిస్టేబుల్, మహారాష్ట్ర)
Also Read: ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు
ఏలూరు రేంజ్ ఐజీ రవికృష్ణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “సైబర్ నేరగాళ్లు వృద్ధులను, మహిళలను ప్రధానంగా లక్ష్యం చేసుకుంటున్నారు. ఆధార్, పాన్ వంటి వివరాలు మిస్యూస్ అయ్యాయని ఫోన్ వచ్చినప్పుడు వెంటనే డబ్బు ఇవ్వకండి. పోలీసు ఎవరూ డిజిటల్ అరెస్ట్ చేయరు. అనుమానం వస్తే 1930కి కాల్ చేయండి” అని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఈ వివరాలు శనివారం వెల్లడించారు. ఈ కేసు విచారణలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఆధార్ వెరిఫికేషన్ పేరుతో మోసం..
ఏలూరులో మహిళ నుంచి రూ.51.90 లక్షలు స్వాహా చేసిన సైబర్ కేటుగాళ్లు
సైబర్ క్రైమ్ కేసులో 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు
నిందితులు ముంబై, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తింపు
వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు… pic.twitter.com/mgscfvAH5A
— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2025