Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్. దీనిపై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 1న కరీంనగర్‌లో జాగృతి జనం బాట కార్యక్రమంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆమె మాటలు రాజకీయ దుమారం రేపాయి.
తన భర్త ఫోన్ ట్యాప్ చేశారు!
అయితే కవిత స్పష్టంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. సొంత బావ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తారా? అంటూ ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వార్తలు వినగానే కడుపులో ఏదోలా అనిపించేది అని చిట్‌చాట్‌లో వెల్లడించారు.
అవమానించినందు వల్లే పార్టీకి దూరమయ్యానని వెల్లడి
పార్టీలో తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగితే భరిస్తాను… కానీ అవమానాన్ని మాత్రం సహించబోను అని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కోసమే పార్టీతో విభేదించాను అని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అవ్వడం, కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడం వంటి సంఘటనలు దీనికి కారణం అని తెలిపారు.
Also Read: సీఎం చొరవ.. పెండింగ్ బిల్లులు క్లియర్
పార్టీలో అసంతృప్తి – టచ్‌లోకి వచ్చారు
బీఆర్ఎస్‌లో చాలామంది అసంతృప్తితో ఉన్నారు అని కవిత వెల్లడించారు. తాను పార్టీ నుంచి బయటపడిన తర్వాత వారు తనకు టచ్‌లోకి వచ్చారు. పాత కేడర్ తో ‘జనం బాట’లో మాట్లాడుతున్నారు అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో SIB ద్వారా అక్రమ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు. సిట్ దర్యాప్తు జరుగుతోంది. కవిత గతంలో కూడా కేటీఆర్ సంబంధులు, హరీష్ రావు, సంతోష్ రావులు ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. దీని ఫలితంగా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినిమా పరిశ్రమ ప్రముఖులు టార్గెట్ అయ్యారు.