Sabarimala Gold Theft: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం దోపిడీ జరిగిన కేసులో.. కీలక మలుపు తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉల్లికృష్ణణ్ పొట్టి 476 గ్రాముల బంగారాన్ని.. 2019లోనే గోవర్ధన్ అనే వ్యాపారికి అమ్మినట్లు సిట్ విచారణలో అంగీకరించాడు. ఈ కేసులో ఇంటి దొంగల ప్రమేయంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సభ్యులపై సిట్ దృష్టి సారించింది. భూముల వ్యవహారంలోనూ ఉల్లికృష్ణణ్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో.. బంగారం దోపిడీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక బృందం ఈ కేసు దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు అయిన ఉల్లికృష్ణణ్ సుమారు 500 గ్రాముల బంగారాన్ని అమ్మేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
అది కూడా 2019లోనే అమ్మానని తెలిపాడు. గోవర్ధన్ అనే వ్యాపారికి 2019లోనే తాను చోరీ చేసిన బంగారాన్ని విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో అంగీకరించాడని అధికారులు తెలిపారు. 2019 లో బంగారం నగలు మెరుగుదిద్దే సమయంలో అవకతవకలు చోరీ చోటుచేసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: ఛత్తీస్‌గఢ్ పర్యటనకు ప్రధాన మోదీ.. రూ.14,000 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన
దీంతో కేరళ సర్కార్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ముందు రెండు కేజీల వరకు బంగారం చోరీకీ గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఉల్లికృష్ణణ్‌ని ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. అక్టోబర్ 30 వరకు అతన్ని కస్డడీకీ తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఉల్లికృష్ణన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా.. 476 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు తేలింది. ప్రస్తుతం ఉల్లికృష్ణణ్ రిమాండ్‌కు తరలించారు.