Health Scheme: రైతు భరోసా, నిరుద్యోగ భృతి, విద్యుత్ మినహాయింపు.. ఇవన్నీ మానవ సేవా కోణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు. కానీ ఆరోగ్యం విషయంలో అన్నీ మించిన అండగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వ AB PM-JAY పథకం(ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన). పేదలకు లక్షల రూపాయల వైద్యం ఉచితంగా అందించే ఈ పథకం, నిజంగా జీవితాలను నిలబెట్టే అమూల్యమైన కార్యక్రమంగా మారింది.
లక్షన్నర విలువైన ఉచిత వైద్యం
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన కుటుంబాలకు ఏడాదికి రూ. 1.50 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించబడుతుంది. ప్రత్యేకంగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. చిన్న వ్యాధుల నుంచీ తీవ్రమైన ఆపరేషన్లు వరకు – అన్ని అవసరాలకు ఈ పథకం సాయపడుతుంది.
ఆస్పత్రిలో చేరినప్పుడే ఆరోగ్య అండ
AB PM – JAYలో పేరు నమోదు చేసుకున్న నాటి నుంచే ఆ కుటుంబానికి ఆరోగ్య భద్రత కలుగుతుంది. రోగి ఆస్పత్రిలో చేరిన నాటినుంచే – వైద్య ఖర్చులు కవర్ అవుతాయి. సర్జరీ, ఔషధ వ్యయం, ICU ఛార్జీలు, డయాగ్నస్టిక్ టెస్టులు.. ఇవన్నీ ఇందులో భాగంగా ఉంటాయి.
కేవలం 7 రోజులు పాటు వైద్యం ఉచితం
ఈ పథకం క్రింద ఆసుపత్రిలో చేరిన తర్వాత కనీసం 7 రోజులు పాటు వైద్యం పూర్తిగా ఉచితంగా ఉంటుంది. అంటే మొదట్లో భయపడాల్సిన అవసరం లేదు, ఆదాయంలేని పరిస్థితుల్లో కూడా శస్త్రచికిత్సల వంటి ఖరీదైన చికిత్సలు పొందే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది.
ప్రమాదమా? వెంటనే సమాచారం… 24 గంటల్లో పోలీసుల సహాయం
ప్రమాదాలు అన్నీ కంట్రోల్‌లో ఉండవు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అలాంటి వేళల్లో PM-JAY సాయాన్ని పొందాలంటే వెంటనే స్పందన అవసరం. అనుమానం, ప్రమాదం జరిగిన వెంటనే 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడు వారు అవసరమైన కేసును నమోదు చేసి వైద్యం కోసం పాసులు జారీ చేస్తారు.
సహాయం కావాలా? 112కు ఫోన్ చేయండి
ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే 112 నంబర్ కు కాల్ చేయడం ద్వారా సహాయం పొందవచ్చు. ఇంకా స్పష్టమైన సమాచారం కోసం EDAR యాప్ ద్వారా కూడా అప్లై చేయవచ్చు. ఇందులో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, ఆస్పత్రులు ఎంచుకోవడం, చికిత్సల వివరాలు తెలుసుకోవడం వంటి అవకాశాలు ఉన్నాయి.
ఎవరు అర్హులు?
ఈ పథకాన్ని పొందే అర్హత ప్రధానంగా ఆర్థిక స్థితి ఆధారంగా నిర్ణయించబడుతుంది. గ్రామీణ మరియు పట్టణ పేద కుటుంబాలు, BPL కార్డుదారులు, నిర్మాణ కార్మికులు, కూలీలు, రేషన్ కార్డు కలిగిన వారు, రవాణా కార్మికులు.. ఇలా అనేక వర్గాలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వారి డేటా ఆధారంగా లబ్దిదారులను గుర్తిస్తాయి.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాలను పొందినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం గణనీయంగా అమలవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటళ్లతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇందులో భాగస్వాములవుతున్నాయి. సొంత రాష్ట్రాల ఆరోగ్య కార్డులతో పాటు AB-PMJAY కార్డు కూడా వాడుకునే వెసులుబాటు కల్పించబడింది.
పథకం యొక్క లక్ష్యం
ఈ పథకం ప్రధాన లక్ష్యం.. ఆరోగ్యం అంటే భయం కాదు, భరోసా కావాలనే భావనను ప్రతి పౌరుడిలో నాటడం. పేదలు ఖరీదైన చికిత్సలను తీసుకోవాలంటే రుణాలు, ఆస్తుల అమ్మకం లాంటి పరిస్థుతులు ఉండకూడదనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
అత్యవసర సమయాల్లో ఎవరూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నది పథక లక్ష్యం. ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు.. ఇది మాటల్లో కాకుండా చర్యల్లో చూపించినదే PM-JAY పథకం. లక్షల్లో రూపాయలు ఖర్చు చేయలేని వారు కూడా లక్షల రూపాయల చికిత్స పొందే హక్కును కలిగించడంలో ఇది ఒక విప్లవాత్మక మార్గం. ఈ సేవను ప్రతి అర్హుడు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుపుతున్నాయి.