Kedarnath: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇవాళ పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని రుద్రపయాగ్ జిల్లాలో గుప్తకాశీ సమీపంలో కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా నేషనల్ హైవేపై అత్యవసర ల్యాండింగ్ అయింది. దీంతో స్థానిక భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనలో హెలికాప్టర్ చివరి భాగం రోడ్డుపై ఉన్న కారును ఢీకొట్టింది. దీంతో కారు కొంత భాగం దెబ్బతింది. ఈ హెలికాప్టర్‌ను క్రెస్టెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
ఈ ప్రైవేట్ హెలికాప్టర్‌లో సిర్సీ నుంచి కేదార్‌నాథ్ ధామ్‌కు భక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉత్తరాఖండ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ వి.మురుగేశన్ ప్రకారం.. హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు, పైలట్ ఉన్నారని అన్నారు. వారు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే.. పైలట్‌కు మాత్రం స్వల్ప గాయాలు అయినట్టు ఆయన తెలిపారు. వెంటనే సమీప ఆసుపత్రికి పైలట్‌ను తరలించారు.
#WATCH | Uttarakhand | A private helicopter en route to Kedarnath Dham made an emergency landing in Guptkashi of Rudraprayag district due to a technical fault. All the people on board the helicopter are safe: Uttarakhand ADG Law and Order Dr V Murugeshan
CEO of UCADA has… pic.twitter.com/Zj1SLluZ7N
— ANI (@ANI) June 7, 2025
ఈ ఘటన గురించి ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UCADA) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు సమాచారం అందించింది. డీజీసీఏ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా అధికారలు కేదార్‌నాథ్‌కు ఇతర హెలికాప్టర్ షటిల్ సర్వీసులు సాధారణంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటన చార్ ధామ్ యాత్రకు వెళ్తున్న క్రమంలో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయినట్టు చెప్పారు. చార్ ధామ్ యాత్ర ఉన్నందున ఈ సమయంలో కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ రాకపోకలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. గడిచిన నెలలో ఉత్తరకాశీలో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారని అధికారులు తెలిపారు.
ALSO READ: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల వాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు
అయితే, ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా ఆందోళన కలిగించినప్పటికీ.. పెనుప్రమాదం తప్పినందుకు అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కేదార్‌నాథ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలు కీలకమైనవి.. కానీ సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు వంటి వాటి వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ALSO READ: Weather News: రాష్ట్రంలో భారీ పిడుగుల వర్షం.. ఈ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండండి..