E-Paper
Advertisement

Krishna District: నమ్మకానికి ‘కన్నం’.. చనిపోయిన వ్యక్తి బంగారం కాజేసిన మాజీ బ్యాంక్ మేనేజర్!

Krishna District: నమ్మకానికి ‘కన్నం’.. చనిపోయిన వ్యక్తి బంగారం కాజేసిన మాజీ బ్యాంక్ మేనేజర్!
Advertisement

Krishna District: ప్రస్తుత కాలంలో సామాన్యుడికి భద్రత అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. బయట అడుగుపెడితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంట్లో నగదు, బంగారం ఉంచుకుంటే దొంగల భయం. అలా కాదు అని ప్రజలు తమ కష్టార్జితాన్ని అత్యంత సురక్షితం అని భావించి బ్యాంక్ లాకర్లలో దాచుకుంటున్నారు. కానీ..’కంచే చేను మేసినట్లు‘ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బ్యాంకుల్లోనే నేడు అక్రమాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నమ్మకానికి మారుపేరుగా నిలవాల్సిన బ్యాంక్ సిబ్బందే నగల మాయం వెనుక ఉండటం లేదా పర్యవేక్షణ లోపంతో విలువైన సొత్తు గల్లంతవ్వడం సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. ఇప్పుడ అలాంటి ఘటనే కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. 

Advertisement

కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంక్‌లో చనిపోయిన వ్యక్తి బంగారాన్ని మాజీ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి కాజేసేంది. బాపులపాడు మండలానికి చెందిన నాగేంద్ర బాబు గతంలో తాకట్టు పెట్టిన బంగారం కోసం ఆయన కుటుంబ సభ్యులు బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ  నామినీగా మాజీ మేనేజర్ ప్రభావతి పేరు ఉండటం చూసి అవాక్కయ్యారు.

ఎటువంటి సంబంధం లేని ప్రభావతికి నాగేంద్ర బాబు డెత్ సర్టిఫికెట్ ఎలా జారీ అయిందని..  ఆమె ఆ సర్టిఫికెట్‌తో బంగారం విడిపించుకునేందుకు వస్తే.. బ్యాంక్ అధికారులు ఎలా ఇచ్చారని బాధితులు నిలదీశారు. గతంలోనూ పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న ప్రభావతి జైలుకి వెళ్లి వచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి..  తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

ALSO READ:సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడప DRC మీటింగ్‌లో ప్రకంపనలు

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×