E-Paper
Advertisement

Kadapa DRC meeting: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడప DRC మీటింగ్‌లో ప్రకంపనలు

Kadapa DRC meeting: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడప DRC మీటింగ్‌లో ప్రకంపనలు
Advertisement

Kadapa DRC meeting: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కడప జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశంలో దుమారాన్ని రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ..వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వైసీపీకి ధీటుగా అధికార పక్షం స్పందించడంతో… సమావేశం..వాగ్వివాదాలతో అట్టుడికిపోయింది. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ..సభ నుంచి వాకౌట్ చేశారు.

జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ నేతలు నిలదీశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తానే చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతలను రద్దు చేయించానని ప్రకటించడంపై జిల్లా రైతాంగం ఆందోళనలో ఉందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై గంటకు పైగా మంత్రి సవితకు, వైసీపీ నేతలకు మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. మంత్రి నుంచి స్పందన రాకపోవడంతో…వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చేశారు.

Advertisement

కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతోందని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు కడుతుంటే నోరు మెదపని ప్రభుత్వం, సీమ రైతుల గొంతు కోస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం ముందు ముందు తీసుకునే చర్యలను బట్టి వైసీపీ తరపున కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ: కత్తితో భర్తను వెంటాడిన భార్య.. నడిరోడ్డుపై కలకలం!

Advertisement

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×