E-Paper
Advertisement

Amaravati News: అమరావతిలో గౌతమ్ అదానీ, సీఎం చంద్రబాబుతో భేటీ, రాత్రివేళ సమావేశం వెనుక?

Amaravati News: అమరావతిలో గౌతమ్ అదానీ, సీఎం చంద్రబాబుతో భేటీ, రాత్రివేళ సమావేశం వెనుక?
Advertisement

Amaravati News: ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ. ముఖ్యమంత్రి చంద్రబాబు, కొడుకు లోకేష్‌తో సమావేశమయ్యారు. రాజకీయ, వ్యాపార అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత గౌతమ్ అదానీ అమరావతి రావడం ఇదే తొలిసారి.

అమరావతిలో గౌతమ్ అదానీ

Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు అవుతోంది. ఆనాటి నుంచి ఎప్పుడు అమరావతికి రాలేదు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఎండీ కరణ్ అదానీ. వీరిద్దరు తొలిసారి అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను బుధవారం రాత్రి కలిశారు. నవంబర్ లో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు కరణ్ అదానీ వచ్చారు, రాబోయే పదేళ్లలో ఏపీలో లక్ష కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించారు కూడా.

బుధవారం రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు గౌతమ్ అదానీ, కరణ్ అదానీ. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి డిన్నర్‌ చేశారు. ఆ తర్వాత ఏపీ అభివృద్ధి గురించి ప్రధానంగా చర్చించారు. ఏపీలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై చర్చించుకున్నారు. అదానీ గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌‌లో గంగవరంలో పోర్టు, విశాఖలో డేటా సెంటర్‌, రాయలసీమలో సిమెంటు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనుంది.

Advertisement

సీఎం చంద్రబాబుతో గౌతమ్ అదానీ భేటీ

వాటి పెట్టుబడులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల సీఐఐ సదస్సులో కుదుర్చుకున్న సంస్థలు చంద్రబాబు సర్కార్ భూములు కేటాయిస్తోంది. ఇదే క్రమంలో అదానీ సంస్థ చేపట్టిన, చేపట్టనున్న ప్రాజెక్టులపై చర్చకు వచ్చింది. మౌలిక సదుపాయాలు, భవిష్యత్ పెట్టుబడులు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు మంత్రి లోకేష్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

వైసీపీ హయాంలో కూడా రాత్రి వేళ అమరావతికి వచ్చారు గౌతమ్ అదానీ. అప్పటి మాదిరిగా బుధవారం రాత్రి వచ్చారు.  పగటి వేళ ఎయిర్ ట్రాఫిక్ అధికంగా ఉండడం ఓ కారణంగా తెలుస్తోంది. అందుకోస మే ప్రత్యేక విమానంలో రాత్రి అమరావతికి వచ్చారని అంటున్నారు. కొత్తగా పోర్టుల విషయం చర్చించినట్టు టీడీపీ వర్గాల మాట.  రేపో మాపో అదానీ గ్రూప్ గురించి ఓ ప్రకటన వచ్చే అవకాశముంది.

ALSO READ: ఎయిడ్స్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. టార్గెట్ 2030

 

 

Related News

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

Big Stories

Advertisement
×