Amaravati: ఆటో-మోటార్- మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. రెండో ఏడాది ఆ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి రూ. 231 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఆటో డ్రైవర్లలో ఒకటే సందడి నెలకొంది.
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం గతేడాది ఆటోడ్రైవర్లకు ‘ఆటో డ్రైవర్ల సేవ’ అనే పథకాన్ని ప్రారంభించనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ కలిసి విజయవాడలో ఈ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభించి ఏడాది గడిచిపోయింది. ఇంకా ప్రభుత్వం స్కీమ్ డబ్బులు వేయకపోవడంతో ఆటో డ్రైవర్లలో అసంతృప్తి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి ఆర్థిక సాయం అందించేందుకు రూ.231.13 కోట్ల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఒక్కో డ్రైవరుకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం చేస్తోంది. ఈ మేరకు వెనుకబడిన తరగతులకు చెందినవారికి ఆర్థిక సాయం కింద నిధుల విడుదలకు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ఆ శాఖ. రేపో మాపో గతేడాది ఇచ్చిన జాబితా ప్రకారం ఆటో డ్రైవర్ల బ్యాంకు అకౌంట్‌లలోకి రూ.15 వేలు నిధులు జమ కానున్నాయి.