Lakshmi Parvathi: రామోజీరావును జాతిపితగా చంద్రబాబు పరిచయం చేయాలనుకోవడం దారుణం అని వైసీపీ నేత లక్ష్మి పార్వతి అన్నారు. అసత్యపరుడు, అవినీతి పరుడు, ప్రజాద్రోహి రామోజీరావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు సహకరించి ముఖ్యమంత్రిని చేశాడు కాబట్టి రామోజీరావు జయంతి పండుగా చేస్తావా.. మరీ నీకు పిల్లనిచ్చి పదవులిచ్చిన ఎన్టీఆర్ జయంతిని నువ్వు ఎందుకు నిర్వహించలేదని లక్ష్మీ పార్వతి ఫైక అయ్యారు.
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర రామోజీదని, అలాంటి వ్యక్తి జయంతికి రాష్ట్ర పండుగ చేస్తారా అంటూ చంద్రబాబుకు నందమూరి లక్ష్మీపార్వతి సూటి ప్రశ్న వేసారు. ముందు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను గౌరవించండి అంటూ చంద్రబాబుకు లక్ష్మీపార్వతి హితవు పలికారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్షీపార్వతి కూటమి ప్రభుత్వం పై నిప్పుులు కురిపించారు.
Also read: మంచిర్యాలలో నలుగురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్!
వెన్నుపోటుదారులకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందని, రామోజీ జయంతికి రాష్ట్ర పండుగ ఎందుకో చెప్పాలని, చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్‌ను ఆయన గద్దె దింపారని.. మీ జాతి పితను తెచ్చి జాతీయ పండుగ చేస్తారా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. డబ్బు సంపాదనపై ‘ధనవద్గీత’ రాసిన వ్యక్తి రామోజీ.. మోసాలు, జనానికి టోకరా, నిబంధనల్ని ఉల్లంఘించారని అన్నారు. మార్గదర్శి కేసులో ఆయన ఆర్ధిక నేరస్తుడని కోర్టే చెప్పిందని, చంద్రబాబుకు రామోజీ ఏ విధంగా ఆదర్శమూర్తో చెప్పాలని నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు.
మద్యపాన నిషేధం పేరుతో రామోజీ డ్రామాలు చేసారు. జగన్ తెచ్చిన ఇంగ్లీష్ మీడియాకి వ్యతిరేకంగా రాతలు రాసి రామోజీ దుర్మార్గుడని కొడుకు సుమన్ చెప్పలేదా..? చంద్రబాబు–రామోజీ మోసాలకు జైల్లో ఉండాలని ప్రజల వద్ద కాదని ప్రెస్‌మీట్‌లో నందమూరి లక్ష్మీపార్వతి సీఎం చంద్రబాబు పై ఫైర్ అయ్యారు.
Also read: సోనియా గాంధీ గుండెల్లో నిజంగా తెలంగాణ లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!
ఎన్టీఆర్కు వెన్నుపోటులో రామోజీరావు పాత్ర ఉంది: లక్ష్మీపార్వతి
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడుకు సహకరించింది రామోజీరావేనని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడంలో రామోజీరావు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారని… pic.twitter.com/NRPD9DzNED
— BIG TV Breaking News (@bigtvtelugu) November 17, 2026