E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా ఇరుక్కున్న సాగర్.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రేమ దెబ్బకు ధీరజ్ షాక్..

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా ఇరుక్కున్న సాగర్.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రేమ దెబ్బకు ధీరజ్ షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 18th: సాగర్ తన గురించి ఎవరికీ తెలియకుండా ఇంట్లో డబ్బులని దాచి పెట్టాలని అనుకున్నాడు. ఇక తర్వాత ఇంట్లోకి రాగానే ఆ డబ్బులని పెరట్లో పెట్టాలని అనుకుంటు ఉంటాడు.అయితే వల్లితో మాట్లాడుతున్న నర్మదా సాగర్ అక్కడ ఏదో దాచిపెడుతున్నాడు అని అనుకుంటుంది అయితే వెనకాలే వెళ్లి ఏం దాస్తున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఇక మళ్ళీ ఫోన్ పెట్టేసి సాగర్ దగ్గరికి వస్తుంది. సాగర్ ఏంటి ఏం చేస్తున్నావ్ ఇక్కడ ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడ నువ్వు ఏం పని చేస్తున్నావు అని నర్మదా అనుమానంగా అడుగుతుంది. ఏమీ లేదు ఇక్కడ పూల కుండీ ఏదో వీగినట్లు అనిపిస్తే చూస్తున్నాను అని అబద్ధం చెప్తాడు. అయితే డబ్బులు దొరికాయి అని చెప్పగానే నర్మదకు అనుమానం కూడా మొదలవుతుంది. ఏం తప్పు చేయట్లేదు కదా ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావని నాకు అనిపిస్తే మాత్రం ఆ తర్వాత నిన్ను అస్సలు క్షమించను అని మనసులో అనుకుంటుంది నర్మదా..

కూరగాయలు అమ్ముకున్న వల్లి..

ఇక తర్వాత రోజు ప్రేమ ధీరజులు ట్రావెల్ ఆఫీస్ కి వెళ్లాలని రెడీ అవుతుంటారు. అదేవిధంగా ఇక సుకన్య కూడా కూరగాయలు కొనాలి అని అనుకుంటుంది అప్పుడే అక్కడికి ఒక కూరగాయలమ్మ ఆవిడ రావడంతో ఈ వీధిలో కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ధీరాజ్ ఏంట్రా కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా నీకు తెలిసే ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావ్ రా అసలు ప్రేమ షాక్ అవుతుంది.. ఆ తర్వాత అందరూ కూరగాయలు అమ్మే ఆవిడని పిలుస్తారు.. ఇక్కడ కూరగాయలు అమ్మడానికి వచ్చిన ఆవిడ అందరితో వరుసలు కలుపుతూ ఉండగా ఈవిడ ఎవరో తెలిసిన మొహం లాగే ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఆ మాట వినగానే వల్లి మొహం చూసి సుకన్య వల్లి నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా అని అంటుంది.. ఇక అందరూ కూడా మా ఇంటి పరువు తీస్తున్నావా? కూరగాయలు అమ్మి అని అంటారు. అయినా మీరు విడాకులు నోటీస్ పంపించారు కదా బావగారు తను ఎలా పోతే మీకెందుకు అని నర్మదా అనగానే అవును నాకెందుకు ఎలా అయినా సావని అని చెప్పేసి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

సాగర్ కోసం పోలీసులు..

Advertisement

సాగర్ ఇంట్లో రెడీ అవుతూ ఉంటాడు అయితే ఇక నేను ఆఫీస్ కి వెళ్ళాలి అని అనుకుంటాడు బయటికి రాగానే అక్కడ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లు కనిపిస్తారు. అది చూసిన సాగర్ నేను లంచం తీసుకుంటున్నట్టు తెలిసిపోయిందా ఏంటి? నాకోసమే వచ్చారా అని కంగారు పడిపోతూ లోపలికి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ సుకన్య తిరుపతి సాగర్ కోసం వచ్చామని ఎంత చెప్తున్నా సరే వాళ్ళు పిలుస్తున్న సాగర్ లోపల నుంచి బయటికి రాడు. ఇక నర్మదా ఆ మాట వినగానే సాగర్ ని బయటికి పిలుస్తుంది సాగర్ రాగానే ఏంటి సార్ చెప్పండి అని అంటాడు.. మీరు లంచం తీసుకుంటున్నారు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని అతను చెప్పగానే ఇక రామరాజు నర్మద ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు..

అడ్డంగా బుక్కయిన సాగర్..

నేను లంచం తీసుకోలేదు మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని సాగర్ మాత్రం అప్పటికి బుకాయిస్తూనే ఉంటాడు. సాగర్ ఎంత చెప్పినా సరే వినకుండా ఆఫీసర్లు ఇంట్లో సెర్చ్ చేయాలని అంటారు. ఇక రామరాజు పాపపు సొమ్ము నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఆ డబ్బులు ఎక్కడున్నాయో వెళ్లి వెతకండి అని ఆఫీసర్లకు పర్మిషన్ ఇస్తాడు.. ఇల్లంతా వెతికిన ఆఫీసులకి డబ్బులు ఎక్కడా కనిపించకపోవడంతో, ఇక నర్మదా ఆ డబ్బులను తెచ్చి ఇస్తుంది. శిక్ష తక్కువ పడేలా చూడండి అని ఆఫీసర్లను అడుగుతుంది. ఇక సాగర్ నీ పోలీసులు అరెస్ట్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతారు. సాగర్ లంచాలు తీసుకొని ఇంటి పరువును తీసేస్తున్నాడు అని రామరాజు చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆఫీసుకు వచ్చినా కస్టమర్లతో ప్రేమ ప్రవర్తించిన తీరు ధీరజ్ కి షాక్ ఇస్తుంది. మొత్తానికి ధీరజ్ కి వచ్చిన బేరాలు అన్నిటిని ప్రేమ పోయేలా చేస్తుంది ఈ ఎపిసోడ్కి ఇదే షాకింగ్ సీన్ అనే చెప్పాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: రమ్యకు తీవ్రని అన్యాయం..పల్లవి ఎంట్రీతో షాక్.. రమ్య, కమల్ పెళ్లి..?

 

Related News

Brahmamudi Serial Today Episode November 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రఘువీర్ కు వార్నింగ్ ఇచ్చిన రాజు 

Intinti Ramayanam Today Episode: రమ్యకు తీవ్రని అన్యాయం..పల్లవి ఎంట్రీతో షాక్.. రమ్య, కమల్ పెళ్లి..?

గాజుల గలగలతో సెన్సేషన్.. ఇప్పుడు వరుస ఫోక్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్న రాధమ్మ కూతురు!

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మిస్ కావొద్దు..

పాలమూరు జంగిరెడ్డి పాటలకు ఫుల్ క్రేజ్.. పల్లె గొంతుక నుంచి సినిమా పాటల వరకు!

బిందె పాటలకి ఈ క్రేజ్ ఏంటి మావా ..మాధురి రాథోడ్ నుండి యమునా తారక్ దాకా !

గుడ్ న్యూస్ చెప్పిన కార్తీకదీపం సూరజ్.. సీరియల్స్ కు గుడ్ బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×