E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రఘువీర్ కు వార్నింగ్ ఇచ్చిన రాజు 

Brahmamudi Serial Today Episode November 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రఘువీర్ కు వార్నింగ్ ఇచ్చిన రాజు 
Advertisement

Brahmamudi serial today Episode: ఐశ్వర్య కంపెనీతో మూడు వందల కోట్ల డీల్‌ చేసిన రఘువీర్‌ను ఎక్స్ ఫో నిర్వాహకులు స్టేజ్ మీదకు పిలుస్తారు. రఘువీర్‌ రాకతో ఎక్స్‌ ఫోకు అందం వచ్చిందని చెప్తారు. రాజు కోపంగా చూస్తూ.. నీతో చీఫ్‌గా బిహేవ్‌ చేసి నీతో చెప్పు దెబ్బలు తిన్న వీడు ఇక్కడ చీఫ్ గెస్టా అంటాడు. నేను అదే షాక్‌లో ఉన్నాను రాజు అంటుంది ఇందు. ఐశ్వర్య కంపెనీని ఏం చూసి ఇంత బిజినెస్‌ ఇచ్చాడు అని రాజు అడిగితే.. చిన్న కంపెనీని నడుపుతున్నాడని వాళ్లు అంటున్నారు కదా అంటూ ఇందు అడిగితే.. అదంతా అబద్దం నిజాలేంటో తెలుసుకుందాం అంటాడు రాజు. రఘువీర్‌ స్టేజీ మీదకు ఎక్కి ఇందును చూస్తూ.. మాట్లాడుతుంటాడు. స్పెషల్‌గా రాజు ఇందులకు స్పెషల్ థాంక్స్‌ చెప్తే.. రాజు వెళ్లిపోదామని చెబితే.. వద్దని వాడేం చేస్తాడో చూద్దామని ఇందు ఆపేస్తుంది.

తర్వాత ఐశ్వర్యను స్టేజీ మీదకు పిలిచి రఘువీర్ చేత విన్నర్‌ ఫ్రైజ్‌ ఇప్పిస్తారు. ఐశ్వర్య జువ్వెల్లర్స్‌ ఈ సిటీలోనే బిగ్గెస్ట్‌ కంపెనీగా ఉంటుందని చెప్తారు నిర్వాహకులు. ఐశ్వర్య ఇది నా గెలుపు కాదు. నన్ను సపోర్ట్‌ చేసిన మీ అందరి గెలుపు అని అంటాను అనుకున్నారా..? అసలు అనను ఎందుకంటే కష్టపడింది నేను బిజినెస్‌ తెచ్చుకుంది నేను.. నేను గెలవాలని పూజలు చేసిన నా అభిమానులకు థాంక్స్‌ అంటుంది. ఇక్కడెవరున్నారు అభిమానులు అనుకుంటూ రాజు.. పార్వతీశంను చూసి అరేయ్ నువ్వే అనుకుంటానురా అంటాడు. ఐశ్వర్య ఇది జస్ట్‌ బిగినింగ్‌ ముందు ముందు ఇంకా ఉంది అంటూ థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతుంది.   తర్వాత రఘువీర్‌ను కలిసి థాంక్స్‌ చెప్తుంది. ఇది కలో నిజమో నమ్మకం కలగడం లేదని అంటుంది. చేతిలో విన్నర్ ప్రైజ్‌ ఉంది కదా అంటాడు రఘువీర్‌.

Advertisement

ఎక్స్‌ ఫో నుంచి డల్లుగా వెళ్తుంటారు ఇందు, రాజు. వాళ్లకు ఎదురుగా వెళ్లి రెచ్చగొడతాడు రఘువీర్‌. రాజు కొట్టబోతే.. ఇందు ఆపేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఈ జన్మంతా నువ్వు తపస్సు చేసినా నువ్వు నన్ను భయపెట్టలేవు.. తొక్కి పెట్టి నార తీసేలోపు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు రాజు.  నన్ను తక్కువ అంచనా వేయకు.. లైఫ్‌లో ఒకటి గుర్తు పెట్టుకో మన శత్రువు రెండో సారి ఎదురైతే మాత్రం లైట్‌గా తీసుకోకు అంటూ వార్నింగ్‌ ఇస్తాడు.

ఇంటికి వెళ్లిన ఐశ్వర్య అందరినీ పిలిచి ఎక్స్‌ ఫోలో తనకు విన్నర్‌ అవార్డ్ వచ్చిందని మూడు వందల కోట్ల బిజినెస్‌ డీల్‌ జరిగిందని చెప్తుంది. రేఖ, భ్రమరాంబ సంతోషంతో మునిగిపోతారు. అపర్ణ వచ్చి ఇందు వాళ్లకు రాలేదా..? అంటే విన్నర్‌ ఇక్కడ ఉన్నాక వాళ్లకు ఎలా వస్తుంది అంటూ చెప్తుంది ఐశ్వర్య. తన డీల్‌ గురించి చెప్తూ.. ఇందు, రాజులను చీప్‌గా మాట్లాడుతుంది. అయినా ఇందు, రాజులు రఘువీర్‌ గురించి ఐశ్వర్యకు చెప్తారు. వాడు చాలా నీచుడని ఎంతో మంది అమ్మాయిలు నష్టపోయారని చెప్తారు. అయినా వినకుండా ఐశ్వర్య మీరు ఇలాగే మాట్లాడతారని రఘువీర్‌ చెప్పాడు అంటుంది.

Advertisement

అయినా ఇందు ఐశ్వర్య కంపెనీ అంటే స్వరాజ్‌ కంపెనీ పేరు నిలబెట్టేలా చేయ్‌ అంటే.. ఇప్పుడు నా కంపెనీ నీ కంపెనీలో భాగం కాదు ఏదో ఒక రోజు నా కంపెనీలో భాగం ఇవ్వమని అడిగే పరిస్థితి వస్తుంది అంటూ చెప్పగానే.. సరే అయితే చూద్దాం అంటూ రాజు, ఇందు వెళ్లిపోతారు. ఐషు వాళ్లు అలాగే మాట్లాడతారు. మనం ఈ విజయాన్ని గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేసుకుందాం అంటుంది. రేఖ మాత్రం ఐశ్వర్య ఎంత ఎత్తుకు ఎదిగినా నా మాట వింటుందా..? ఎంత ఎత్తుకు వెళ్లినా నా మాట వినాల్సిందే అని మనసులో అనుకుంటుంది. రూంలోకి వెళ్లిన ఇందు కోపంగా ఐశ్వర్యను తిడుతుంది. దానికి పిచ్చి ఎక్కిందా…? అంటుంది. తన గురించి తెలిసిందే కదా ఎందుకు ఆలోచించడం అంటాడు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: రమ్యకు తీవ్రని అన్యాయం..పల్లవి ఎంట్రీతో షాక్.. రమ్య, కమల్ పెళ్లి..?

గాజుల గలగలతో సెన్సేషన్.. ఇప్పుడు వరుస ఫోక్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్న రాధమ్మ కూతురు!

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మిస్ కావొద్దు..

పాలమూరు జంగిరెడ్డి పాటలకు ఫుల్ క్రేజ్.. పల్లె గొంతుక నుంచి సినిమా పాటల వరకు!

బిందె పాటలకి ఈ క్రేజ్ ఏంటి మావా ..మాధురి రాథోడ్ నుండి యమునా తారక్ దాకా !

గుడ్ న్యూస్ చెప్పిన కార్తీకదీపం సూరజ్.. సీరియల్స్ కు గుడ్ బై చెప్పినట్టేనా?

చిన్నారి అశ్వర్థకు అండగా శివ జ్యోతి ..భారీగా ఆర్థిక సాయం!

Big Stories

Advertisement
×