Cyclone Akwan:ఏపీని వరుస తుఫాన్లు వెంటాడుతున్నాయి. తొలుత అర్నబ్, మురసు, అక్వాన్ తుఫాను వంతు అయ్యింది. ఏపీ తీరం వైపు ప్రస్తుతం అక్వాన్ తరుముకుంటూ వస్తోంది. మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారతుందని అమరావతి వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తుఫాను నేపథ్యంలో కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు మొదలయ్యాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వరుస తుఫాన్లతో ఏపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గడిచిన రెండు వారాలు ఓ వైపు అర్నబ్, మరోవైపు మురసు తుఫాన్లు బీభత్సం సృష్టించాయి. శ్రీకాకుళం జిల్లా మొదలు ప్రకాశం వైపు వణికించాయి. ఇప్పుడు అక్వాన్ సైక్లోన్ దక్షిణ-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుతం ఉత్తర వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారింది.
గడిచిన 6 గంటల్లో గంటకు 3 కి.మీ వేగంతో కదులుతూ వాయవ్య దిశగా పయనిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం అక్వాన్ సైక్లోన్.. చెన్నైకి 590 కి. మీ, మచిలీపట్నానికి 620 కి. మీ, విశాఖపట్నానికి 620 కి. మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కి. మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
అర్ధరాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో చల్లటి గాలులు వీస్తున్నాయి. బుధవారం నుంచి శ్రీకాకుళం మొదలు కృష్ణా జిల్లా వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం కొన్ని చోట్ల 20 సెంటిమీటర్లు పైగానే వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అర్నబ్ తక్కువ, మురసుకు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేవలం కోస్తాలు కాకుండా అటు రాయలసీమలో కూడా భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.
ALSO READ: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్, బలమైన గాలులు మొదలు
శుక్రవారం విశాఖ-కాకినాడ మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తోంది. రానున్న మూడు రోజులు గంటకు 100 నుంచి 120 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వస్తాయని గురువారం నాటికి ఆ గాలుల ఉధృతి పెరుగుతుందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, లోపల ఉన్నవారు ఒడ్డుకు రావాలని హెచ్చరించింది. ఇదిలావుండగా తుఫాన్లపై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని, ఇంట్లోని విలువైన పత్రాలను వాటర్ ఫ్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవాలని సూచన చేసింది.