E-Paper
Advertisement

ఏపీ కాంట్రాక్టు ఉద్యోగాల జాబ్ స్కామ్‌లో.. మేడ్చల్ ప్రాంత లింకులు..?

ఏపీ కాంట్రాక్టు ఉద్యోగాల జాబ్ స్కామ్‌లో.. మేడ్చల్ ప్రాంత లింకులు..?
Advertisement

AP Job Scam: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాబ్‌ స్కామ్‌ వ్యవహారంలో మేడ్చల్‌ లింకులు కలకలం రేపుతున్నాయి. విజయవాడతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడి కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా వెలుగులోకి వస్తున్న వివరాలు ఈ వ్యవహారం వెనుక మేడ్చల్‌ కేంద్రంగా నెట్‌వర్క్‌ ఉన్నట్లు అనుమానాలకు తావిస్తున్నాయి.

మేడ్చల్‌లో పీజీ హాస్టల్‌ కేంద్రంగా..

మేడ్చల్‌లోని వినాయక్‌నగర్‌లో నిమ్మకాయల పెద్దిరాజుకు చెందిన పీజీ హాస్టల్‌ ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగాల పేరుతో మోసాల వ్యవహారం వెలుగులోకి రావడంతో పెద్దిరాజు పరారైనట్లు సమాచారం. సుమారు 15 రోజుల క్రితమే పీజీ హాస్టల్‌ను వేరే వ్యక్తులకు అప్పగించి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ హాస్టల్‌కు, జాబ్‌ స్కామ్‌కు మధ్య ఉన్న సంబంధాలపై స్పష్టత రావాల్సి ఉంది.

తల్లీకూతుళ్లతో కలిసి వల?

Advertisement

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకులను ఓ మహిళ, ఆమె కుమార్తెతో కలిసి పెద్దిరాజు పరిచయాల ద్వారా ఆకర్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జనసేన కార్యాలయంలో ధరణి అనే తమకు తెలిసిన వ్యక్తి పనిచేస్తున్నారంటూ స్థానికంగా ప్రచారం చేసి, ఉద్యోగాల కోసం వచ్చేవారికి ఆమె వివరాలను చూపిస్తూ నమ్మకం కలిగించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరణి తల్లి నాగమణి, పెద్దిరాజు కలిసి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: ముద్రా రుణాల పేరుతో భారీ సైబర్ మోసం

Tags

Related News

రూటు మార్చుకున్న అక్వాన్ తుఫాన్.. ఈ ప్రాంతాల్లో డేంజర్ బెల్స్..?

నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీకి ఆర్థిక సాయంపై కీలక చర్చ

రామోజీరావు జయంతి రాష్ట్ర పండుగపై.. నందమూరి లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్?

ఆ రాతలేంటి? శుభలేఖ ఇస్తే ఆత్మీయ సంబంధాలని అంటగడతారా? ఓ రేంజ్‌లో వైఎస్ షర్మిల ఫైర్

కీలక మార్పులు మొదలుపెట్టిన జగన్.. నియోజకవర్గాల్లో 80 మంది ఔట్, రిపోర్టు ఏమని వచ్చింది?

అక్వాన్ తుఫాన్ ముప్పు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఓఎన్‌జీసీ పాయింట్ నుంచి భారీగా గ్యాస్ లీకేజ్.. తీవ్ర భయాందోళనలో స్థానికులు, కోనసీమ జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×