E-Paper
Advertisement

Kadapa: పులివెందులలో కాల్పులు.. ఒకరు మృతి.. నిందితుడిపై వివేక హత్య కేసులో ఆరోపణలు..

Kadapa: పులివెందులలో కాల్పులు.. ఒకరు మృతి.. నిందితుడిపై వివేక హత్య కేసులో ఆరోపణలు..
Advertisement
gun fire

Kadapa: పులివెందులలో కాల్పుల కలకలం చెలరేగింది. పట్టపగలు, BSNL ఆఫీసు ముందు.. ఇద్దరిపై కాల్పులు జరిపాడు నిందితుడు. దిలీప్, మస్తాన్ బాషాలకు బుల్లెట్లు దిగాయి. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దిలీప్ చనిపోయాడు. చాతి, కడుపులో బుల్లెట్లు దిగడంతో మృతిచెందాడు.

కాల్పులు జరిపింది భరత్ కుమార్ యాదవ్ అని తెలుస్తోంది. కొంతకాలంగా దిలీప్‌తో భరత్‌కు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయి. అదును చూసి దిలీప్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు భరత్ కుమార్ యాదవ్. ఆ సమయంలో దిలీప్‌తో పాటు ఉన్న బాషాపైనా ఫైరింగ్ చేశాడు.

Advertisement

ఇక, భరత్ కుమార్ యాదవ్‌.. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఓసారి సీబీఐ అతన్ని విచారించింది. వివేకానందరెడ్డికి సునీల్ యాదవ్‌ను పరిచయం చేసింది భరత్ కుమారే. ఆ దిశగా సీబీఐ ప్రశ్నించింది. ఆ భరత్ కుమార్ యాదవే ఇప్పుడు ఇలా పులివెందులలో గన్‌తో రెచ్చిపోయాడు. తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒకరు చనిపోవడం, మరొకరికి తీవ్రగాయాలు కావడం కలకలం రేపుతోంది. సీఎం జగన్ సొంత ఇలాఖా కావడంతో.. మరింత సంచలనంగా మారింది. నిందితుడు భరత్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×