BigTV English

Krishna River : కృష్ణమ్మ పరవళ్లు.. ప్రాజెక్టులకు జలకళ..

Krishna River : కృష్ణమ్మ పరవళ్లు.. ప్రాజెక్టులకు జలకళ..
Krishna River latest news


Krishna River latest news(Andhra news today): కృష్ణా నదిలోకి వరద పోటెత్తింది. ఏపీ, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వాగులు, వంకల ద్వారా నీరు కృష్ణా నదిలో కలుస్తోంది. కృష్ణా, తుంగభద్ర నదుల్లో జల ప్రవాహం ఉధృతంగా మారింది. తెలంగాణ, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది.

కర్ణాటకలోని ఎగువ ప్రాంతాలైన ఆరావళి, శృంగేరి, మలైనాడు, వర్నాడు, శివమొగ్గలో కురుస్తున్న వర్షాలకు వరద భారీగా చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1619.16 అడుగులకు చేరింది. కర్ణాటక పరిధిలోని నారాయణపూర్ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 33వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.


శ్రీశైలం డ్యామ్‌కు వరదనీరు చేరుతుండటంతో జలకళ సంతరించుకుంటోంది. జలాశయంలో నీటి నిల్వ 90 టీఎంసీలు దాటితే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తారు. అక్కడినుంచి నంద్యాల జిల్లా పరిధిలోని వెలుగోడు, గోరుకల్లు, అవుకు డ్యామ్‌లకు కృష్ణా జలాలు చేరుకుంటాయి.

ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటిమట్టాన్ని నిలువ చేస్తూ అదనపు నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ 50 గేట్లు 6 అడుగులు మేర ఎత్తగా.. 20 గేట్లను 5 అడుగులు మేరకు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామస్తులను నదీ పరివాహక ప్రాంత అధికారులను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Related News

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×