E-Paper
Advertisement

AP Home Minister : వడమాలపేట బాధిత కుటుంబానికి హోం మంత్రి పరామర్శ

AP Home Minister : వడమాలపేట బాధిత కుటుంబానికి హోం మంత్రి పరామర్శ
Advertisement

AP Home Minister :

⦿ వడమాలపేట బాధిత కుటుంబానికి పరామర్శ
⦿ నిందితుడికి కఠిన శిక్షపడేలా చూస్తామని హామీ
⦿ వైసీపీ హయాంలో ఏం జరిగిందో చూసుకోవాలి
⦿ నేతలకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

తిరుపతి, స్వేచ్ఛ : తిరుపతి జిల్లా వడమాలపేటలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబానికి మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిత గత ఐదు సంవత్సరాల పాలన వైఫల్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. గంజాయి, మద్యం మత్తులో చిన్నారిపై లైంగిక దాడి, హత్య జరిగిందని చెప్పారు.

రోజాకు కౌంటర్
‘ నిందితుడికి మూడు నెలల్లో శిక్ష పడేలా పనిచేస్తాం. పాస్ట్ ట్రాక్‌ కోర్టులో కేసు విచారణ జరుగుతుంది. వైసీపీ నేతలు పదే పదే ప్రభుత్వ వైఫల్యమని విమర్శిస్తున్నారు. ముందు మీ హయాంలో ఏం జరిగిందో చూసుకోండి. గత ఐదేళ్లలో అత్యాచారాలు, హత్యలు జరగలేదా? గతంలో నిందితులపై కనీసం కేసులు కూడా పెట్టలేదు.. వారిని పట్టుకోలేదు. దిశ అనే యాప్ లేదు.. అది ఫోర్త్ లైన్ యాప్ మాత్రమే. దిశ అనే హాడావుడి ఎందుకు? సీఎం చంద్రబాబుకు అడబిడ్డలు లేరని ప్రచారం చేస్తున్నారు కానీ రాష్టంలోని ఆడబిడ్డలను తన ఆడ బిడ్డలాగా చూసుకుంటున్నారు. మద్యం షాపుల్లో వైసీపీ బ్రాండ్లు పెట్టడం లేదని రోజా బాధపడుతున్నారా? బెల్టు షాపులు కనపడితే, బెల్టు తీస్తానని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. రోజాకు సామాజిక బాధ్యత ఉంటే ఎక్కడైనా బెల్టు షాపులు ఉంటే ఫిర్యాదు చేయాలి. వెంటనే చర్యలు తీసుకునే పని మేం చేస్తాం. ఎవరు పడితే వాళ్లు ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని అనిత హెచ్చరించారు.

Advertisement

ALSO READ : వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. నైరాశ్యంలో జగన్ టీమ్, పీకే టీమ్ లేకుంటే పనికాదా?

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×