BigTV English

Ichchapuram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. టీడీపీ కంచుకోట.. ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్ హ్యాట్రిక్ ఖాయమా..?

Ichchapuram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. టీడీపీ కంచుకోట.. ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్ హ్యాట్రిక్ ఖాయమా..?
Ichchapuram Assembly Constituency

Ichchapuram Assembly Constituency : శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఒక్క 2004 తప్ప 1983 నుంచి 2019 వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఈ సెగ్మెంట్లో ఎక్కువ శాతం మంది టీడీపీకి విధేయులుగా ఉన్న వారే. అయితే ఇక్కడ సత్తా చాటాలని కాంగ్రెస్, వైసీపీ ఎంత ప్రయత్నాలు చేసినా అది నెరవేరడం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పాదయాత్రలను ఇచ్చాపురంలోనే ముగించారు. అక్కడే భారీ బహిరంగ సభలు కూడా పెట్టారు. అయినా వారికి సరైన ఫలితాలు ఇక్కడ రాలేదు. టీడీపీ సీనియర్ నేత ఎంవీ కృష్ణారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం టీడీపీ నుంచి బెందాళం అశోక్ మూడోసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అదే సమయం వైసీపీ నుంచి సాయిరాజ్, రామారావు ఇద్దరూ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. అసలు ఈసారి అభ్యర్థులపై ఇచ్చాపురం జనం ఏమనుకుంటున్నారు… వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందన్న విషయాలను తెలుసుకునే ముందు ఓసారి 2019 ఎన్నికల ఫలితాలను విశ్లేషిద్దాం.


2019 ఎన్నికల ఫలితాలు..

పిరియా సాయిరాజ్ VS బెందాళం అశోక్ ( గెలుపు )
YCP 42 %
TDP 46%
జనసేన 6%


2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చాపురంలో టీడీపీ నుంచి అశోక్, వైసీపీ నుంచి పిరియా సాయిరాజ్ పోటీ పడ్డారు. అయితే టీడీపీ అభ్యర్థికి 46 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి 42 శాతం ఓట్లు సాధించారు. సాయిరాజ్ బలమైన కాళింగ కమ్యూనిటీకి చెందిన నేత. ఈ సామాజికవర్గం ఇచ్చాపురంలో కీలకంగా ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైసీపీ హవా కనిపించినా ఇచ్చాపురంలో మాత్రం ఆ వేవ్ అందుకోలేకపోయింది. జనసేన కూడా దాసరి రాజు అనే అభ్యర్థిని నిలబెట్టి 6 శాతం ఓట్లు సాధించింది. మరి ఈసారి ఎన్నికల్లో ఇచ్చాపురం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

పిరియా సాయిరాజ్ ( YCP ) ప్లస్ పాయింట్స్

  • గత ఎన్నికల్లో ఓడినా సెగ్మెంట్ లో కీ రోల్
  • ఇంటింటికి ప్రచారం ముమ్మరం

పిరియా సాయిరాజ్ మైనస్ పాయింట్స్

  • అచ్చెన్నాయుడు హవాను అడ్డుకునే కెసాపిటీ ఉందా అన్న డౌట్లు

నర్తు రామారావు ( YCP )ప్లస్ పాయింట్స్

  • వైసీపీలో మొదటి నుంచి కీ రోల్
  • ఎమ్మెల్సీగా బాధ్యతలు

నర్తు రామారావు మైనస్ పాయింట్స్

  • గ్రౌండ్ లెవెల్ లో పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం

బెందాళం అశోక్ ( TDP ) ప్లస్ పాయింట్స్

  • నియోజకవర్గంలో జనంలో మంచి పట్టు ఉండడం
  • టీడీపీ అధినాయకత్వం ఫుల్ సపోర్ట్

బెందాళం అశోక్ మైనస్ పాయింట్స్

  • నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగకపోవడం
  • స్పెషల్ ఫండ్స్ ఏవీ తీసుకురాలేకపోవడం

కులాల లెక్కలు..
రెడ్డిక 18%
యాదవ్ 17%
పల్లి 12%
బీసీ కాళింగ 12%
కాపు 6%
అగ్నికుల క్షత్రియ 5%

ఇచ్చాపురంలో బీసీ సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉంది. ఇందులో ఉప వర్గాల్లో కొన్ని చాలా బలంగా ఉన్నాయి. బీసీ రెడ్డిక వర్గంలో 60 శాతం మంది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి, 35 శాతం వైసీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. బీసీ యాదవ్స్ లో 40 శాతం టీడీపీ-జనసేనకు, 55 శాతం వైసీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. బీసీస పల్లిలో టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థికి 45 శాతం, వైసీపీకి 45 శాతం, ఇతరులకు 10 శాతం మద్దతుగా ఉంటామంటున్నారు. ఇక బీసీ కాళింగ వర్గంలో టీడీపీ, వైసీపీలకు చెరో 50 శాతం మంది సపోర్ట్ ఇస్తామని సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. కాపు సామాజికవర్గంలో 50 శాతం మంది టీడీపీకి, 45 శాతం మంది వైసీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. అటు అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన వారిలో 45 శాతం మంది టీడీపీకి, 45 శాతం వైసీపీకి, 10 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామని సర్వేలో చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

పిరియా సాయిరాజ్ VS అశోక్ బెందాళం
YCP 45%
TDP 49%
OTHERS 6%

ఇచ్చాపురంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థికే ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. వైసీపీ నుంచి పిరియా సాయిరాజ్ పోటీలో ఉంటే టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ కు 49 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలో వెల్లడైంది. అలాగే సాయిరాజ్ కు 45 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నర్తు రామారావు VS అశోక్ బెందాళం
YCP 42%
TDP 52%
OTHERS 6%

మరోవైపు వైసీపీ నుంచి ఇచ్చాపురం సెగ్మెంట్ లో నర్తు రామారావు బరిలో ఉన్నా.. మరింత మెజార్టీతో టీడీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. నర్తు రామారావు వైసీపీ నుంచి పోటీ చేస్తే 42 శాతం ఓట్లు రాబట్టే అవకాశం ఉందని, అదే సమయంలో టీడీపీ అభ్యర్థి అశోక్ 52 శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. మరోవైపు ఇతరులు 6 శాతం ఓట్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

Big Stories

×