E-Paper
Advertisement

Godrej vs Whirlpool: తక్కువ బడ్జెట్‌లో.. టాప్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. రెండింటిలో ఏది బెస్ట్!

Godrej vs Whirlpool: తక్కువ బడ్జెట్‌లో.. టాప్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. రెండింటిలో ఏది బెస్ట్!
Advertisement

Godrej vs Whirlpool: వేసవి కాలం కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు.. ఫ్రిడ్జ్ లను కొనుగోలు చేస్తున్నారు. అయితే బడ్జెట్ లో సింగిల్ డోర్ విభాగంలో రెండు ఫ్రిడ్జ్ లు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గోద్రేజ్, వర్ల్ పూల్ కంపెనీలకు చెందిన ‘Godrej 194 L 5 Star’, ‘Whirlpool 260 236 L 4 Star’ సింగిల్ డోర్ విభాగంలో అత్యుత్తమమైనవిగా నిలుస్తున్నాయి. అయితే ఫీచర్ల పరంగా ఈ రెండు ఫ్రిడ్జ్ లలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అవి ఏంటి? రెండింటిలో ఏది కొంటే బెటరో ఇప్పుడు పరిశీలిద్దాం.

కెపాసిటీ, స్టోరేజ్

Whirlpool మోడల్ 236 లీటర్ల భారీ కెపాసిటీతో వస్తుంది. ఇది పెద్ద కుటుంబాలకు లేదా ఎక్కువ వస్తువులు నిల్వ చేసుకునే వారికి చాలా బాగుంటుంది. దీనితో పోలిస్తే Godrej మోడల్ 194 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంది. ఇది చిన్న కుటుంబాలకు (2-3 సభ్యులు) లేదా బ్యాచిలర్లకు సరిపోతుంది. మీకు ఫ్రిజ్‌లో ఎక్కువ స్థలం కావాలంటే వర్ల్‌పూల్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది.

విద్యుత్ పొదుపు

Advertisement

పవర్ సేవింగ్ విషయంలో Godrej పైచేయి సాధిస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి చాలా తక్కువ యూనిట్ల విద్యుత్తును మాత్రమే ఖర్చు చేస్తుంది. దీనివల్ల మీ కరెంట్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. మరోవైపు Whirlpool మోడల్ 4 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది కూడా మంచి పొదుపును ఇస్తుంది. కానీ 5 స్టార్ రేటింగ్ ఉన్న గోద్రెజ్ అంత సమర్థవంతంగా ఉండకపోవచ్చు.

కూలింగ్ టెక్నాలజీ

వర్ల్‌పూల్ తన సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ లో ప్రత్యేకమైన 6th Sense IntelliFresh టెక్నాలజీని ఉపయోగించింది. ఇది ఫ్రిజ్ లోపల ఉన్న లోడ్, బయట ఉష్ణోగ్రతను బట్టి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకుంటుంది. అలాగే ఇందులో Laminar Airflow ఉండటం వల్ల గాలి అని దిశల్లోకి సమానంగా వ్యాపిస్తుంది. మరోవైపు గోద్రెజ్ Advanced Inverter Technologyని ఇందులో అమర్చింది. ఇది కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తూ నిశ్శబ్దంగా పనిచేసేలా చేస్తుంది. అలాగే పవర్ కట్స్ సమయంలో హోమ్ ఇన్వర్టర్‌పై కూడా సులభంగా నడిచేందుకు సాయపడుతుంది.

డిజైన్, అదనపు ఫీచర్లు

Advertisement

గోద్రెజ్ మోడల్ తన E-IMPRESS సిరీస్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. దీని ఫినిషింగ్ ప్రీమియంగా ఉంటుంది. ఇందులో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచే ఫీచర్లు ఉన్నాయి. వర్ల్‌పూల్ మోడల్‌లో Crescent Door Designతో ఆకట్టుకుంటోంది. దీనిలో పెద్ద వెజిటబుల్ బాక్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ రెండు ఫ్రిజ్‌లు కూడా కింద Base Stand Drawer కలిగి ఉన్నందున కింది భాగంలో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి వాటిని నిల్వ చేసుకోవచ్చు.

Also Read: Haier vs Samsung Fridges: సమ్మర్ కోసం.. ఈ రెండు ఫ్రిడ్జ్‌లలో.. ఏది కొంటే బెటర్?

ఫైనల్‌గా ఏది కొంటే బెస్ట్?

మీది చిన్న ఫ్యామిలీ అయ్యి ఉండి, తక్కువ విద్యుత్ బిల్లును కోరుకుంటే గోద్రేజ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుగోలు చేయవచ్చు. తక్కువ స్థలంలో ఉండే వంటగదులకు ఇది బెస్ట్. అలాకాకుండా అధిక సామర్థ్యం, ఎక్కువ స్టోరేజ్ కోరుకుంటే వర్ల్‌పూల్ మోడల్‌ ఫ్రిడ్జ్ కొనుగోలు చేయవచ్చు. ఫైనల్ గా మీ అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా ఉన్న కొనుగోలు చేయండి.

ముఖ్య గమనిక: గోద్రేజ్, వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ ల మధ్య వ్యత్యాసాలను సదరు కంపెనీలు విడుదల చేసిన ఫీచర్ల ఆధారంగా అందించడం జరిగింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. ఫ్రిడ్జ్ ల ఫీచర్లకు బిగ్ టీవీ ఎలాంటి బాధ్యత వహించదు.

Also Read: YSRCP vs TDP: టీడీపీని ఇరికించిన ఎంపీ.. వైసీపీ చేతికి మరో అస్త్రం.. ఔరా హతవిధి!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×