BigTV English

Pawan Kalyan: పిఠాపురం ఆడపడుచుల కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడో తెలుసా?

Pawan Kalyan: పిఠాపురం ఆడపడుచుల కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడో తెలుసా?

In Andhra’s Pithapuram.. Pawan Kalyan Plans Grand Shravanam Gifts For Women: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేసినా సెన్సేషనే. సినిమాలలో సంపాదించిన డబ్బంతా చదువుకునే పేద విద్యార్థులకు, కిడ్నీ బాధితులకు ఇలా తనకు తోచిన సాయం అందిస్తూ వస్తున్నారు. తన పేరిట ఆస్తులు కూడబెట్టుకునేందుకు సైతం ఇష్టపడరు. తానే కాదు తన పార్టీ కార్యకర్తలను కూడా నిజాయితీగా ఉండాలని..సామాజిక సేవా లక్ష్యంతో మెలగాలని సూచిస్తుంటారు. ప్రస్తుతానికి తాను చేస్తున్న సినిమాలన్నీ పెండింగ్ లో పెట్టి..మంత్రిగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. సినిమాల పరంగా ఒప్పుకున్నవి పూర్తి చేసేసి..ఇకపై సినిమాలకు సైతం స్వస్తి చెప్పనున్నారని సమాచారం. రాజకీయ నాయకులు తాము చెప్పేవి ఏమీ చెయ్యరు. చేసేది మాత్రం ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కానీ వారు ఏమీ చేయరన్న సంగతి తర్వాత గానీ అర్థం కాదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం తాను ఏదైతే చెబుతారో తప్పక అది చేసి తీరతారు. పవన్ కళ్యాణ్ లో ఆవేశమే కాదు..ఆధ్యాత్కికత కూడా ఎక్కువే. ఎందుకంటే ఆయన తన ఫాం హౌస్ లో గోసేవ చేస్తుంటారు. అలాగే చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తుంటారు. హిందూ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తుంటారు.


పవన్ ముందు చూపు

పదేళ్లుగా ఎలాంటి పదవులూ ఆశించకుండా ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి మంచీచెడ్డా చూసుకుంటూ వస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అటు బీజేపీని, ఇటు టీడీపీని తన జనసేనను కలిపి ఓ బలమైన కూటమిగా చేసే యత్నంలో అద్భుత విజయం సాధించారు. ఇదంతా పవన్ ముందు చూపుతోనే సాధ్యమయిందని అటు మోదీ, ఇటు చంద్రబాబు పవన్ ను అభినందనలతో ముంచెత్తారు. పవన్ కళ్యాణ్ కూడా తన అభ్యర్థులందరినీ గెలిపించుకుని విజయం సాధించిన జోష్ లో ఉన్నారు. తన నియోజకవర్గం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ని నెత్తిపై పెట్టుకున్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. అయితే పిఠాపురం పుణ్యక్షేత్రంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో పిఠాపురం మహిళలు పాల్గొంటున్నారు.


ఆధ్యాత్మిక కార్యక్రమంలో పవన్

అమ్మవారి భక్తుడైన పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి స్వయంగా పాల్గొంటున్నారు. దీనితో అక్కడ జనసేన అభిమానులు, దేవాదాయ శాఖ అధికారులు పవన్ కు స్వాగత సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆలయంలో వరలక్ష్మీ సామూహిక పూజలు జరుగుతుంటాయి. అయితే శ్రావణ మాసంలో వచ్చే చివరి శుక్రవారం లో నిర్వహించే ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొనడమే ఈ వేడుక ప్రత్యేకత. మరి పిఠాపురం ఆడపడుచులను పవన్ కళ్యాణ్ ఉట్టి చేతులతో పంపరు కదా..ఆడపడుచుల కోసం ప్రత్యేక కానుకలు సిద్ధం చేశారు జనసేన కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతో దాదాపు 12 వేల చీరలు అందజేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఫొటో ఉన్న ప్రత్యేక బ్యాగులలో చీర, పసుపు,కుంకుమ, గాజులు, పండ్లు అన్నీ సిద్ధం చేసి పంపిణీ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.

జనసేన ఆధ్వర్యంలో..

పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న ఆధ్యాత్మిక కార్యక్రం ఇదే మొదలు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమం జరిపేందుకు ఉత్సాహం చూపడంతో జనసేన కార్యకర్తలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం ఒక క్రమపద్ధతిలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా విజయవంతంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. ఇందు కోసం మహిళలకు ప్రత్యేకంగా టోకెన్లు పంపిణీ చేశారు కార్యకర్తలు. మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుపుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ సామూహిక వరలక్ష్మి పూజలు జరుగుతాయని ఆలయ పాలక అధికారి తెలిపారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×