BigTV English

Yuvagalam Sabha: యువగళం ముగింపు సభపై తీవ్ర ఉత్కంఠ.. ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారా ?

Yuvagalam Sabha: యువగళం ముగింపు సభపై తీవ్ర ఉత్కంఠ.. ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారా ?

Yuvagalam Sabha: ఏపీలో ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమున్నా.. పొలిటికిల్ హీట్‌ మాత్రం పీక్స్‌కు చేరింది. ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ ఈ హీట్‌ను కాస్త హైవోల్టేజ్‌గా మార్చేసింది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ హాజరవుతుండటంతో ఇరు పార్టీల కార్యకర్తలతో పాటు ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. ఈ సభలో వాళ్లిద్దరు ఏం మాట్లాడుతారు? క్యాడర్‌కు ఇచ్చే సందేశమేంటి? ఏపీ ప్రజలను ఏం కోరనున్నారు? అనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నేతలు.

అంతేగాకుండా ఇప్పటికే మినీ మేనిఫెస్టోను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. అయితే జనసేనతో పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని ఇప్పటికే నేతలు డిసైడ్ అవ్వడంతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించనున్నాయి పార్టీలు. ఈ సభలోనే ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అంతేగాకుండా సీట్లు సర్దుబాటుపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.


టీడీపీ-జనసేన పొత్తు ఇప్పటికే ఖరారైనా.. వీళ్లతో బీజేపీ ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నగానే ఉండిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాయి. ఏపీలో కూడా జనసేనతో తమ పొత్తు ఉందని బీజేపీ నేతలు చెప్తున్నా.. పవన్ మాత్రం చంద్రబాబుతో కలిసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఉంటే దానికి టీడీపీ అంగీకరిస్తుందా? టీడీపీ అంగీకరించినా.. బీజేపీ సమ్మతిస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఈ అంశంపై కూడా సభ వేదిక నుంచి పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

వైసీపీ సర్కార్‌పై ఇప్పటికే యుద్ధం ప్రకటించాయి ఈ రెండు పార్టీలు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జగన్‌పై చేసే పోరాటాలకు సంబంధించి ఇదే వేదిక నుంచి క్యాడర్‌కు మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంతేగాకుండా లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా తెలుసుకున్న సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ.. వైసీపీ సర్కార్‌ అవినీతి.. రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో జరుగుతున్న దోపిడిని పవన్ వివరిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Related News

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Big Stories

×