BigTV English

Pink Lake : ప్రకృతి చేసే మాయ.. పింక్ లేక్స్‌

Pink Lake : ప్రకృతి చేసే మాయ.. పింక్ లేక్స్‌

Pink Lake : సరస్సులు నీలి రంగులో ఉంటాయి. లేదంటే బ్రౌన్, గ్రీన్ వర్ణాల్లో కనిపించొచ్చు. మరి గులాబీవర్ణంలో ఉన్న లేక్‌లను ఎన్నడైనా చూశారా? ఆస్ట్రేలియాలో బబుల్‌గమ్-పింక్ చెరువులు కనిపిస్తాయి. ప్రపంచంలో అక్కడక్కడా ఇలాంటి లేక్స్ ఉన్నా.. పశ్చిమ, దక్షిణ ఆస్ట్రేలియాలో ఇవి ఎక్కువ. లేక్ హీలియర్, హట్ లాగూన్, లేక్ బమ్‌బంగా, లేక్ మాక్‌‌డొనెల్ వంటివి వీటిలో ముఖ్యమైనవి. వీటిని చూసేందుకు ఏటా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు.


ఓ రకమైన బ్యాక్టీరియా, ఆల్గే కారణంగా గులాబీ రంగును సంతరించుకుంటాయా చెరువులు. వాతావరణంలో మార్పుల పుణ్యమా అని గులాబీవర్ణం చెరువుల సంఖ్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్లైమేట్ ఛేంజ్ వల్ల కొత్త చెరువులు పింక్‌ రంగులోకి మారడం లేదంటే ఇతర గులాబీ సరస్సులు పూర్తిగా ఎండిపోవడమో జరుగుతోంది. ఈ చెరువుల్లో ఉప్పదనం చాలా ఎక్కువ. దానిని తట్టుకుని బతకగల ఆల్గే కారణంగా ఆ చెరువులకు గులాబీ వర్ణం వస్తుంది.

ఇందుకు కారణం గ్రీన్ ఆల్గే జాతికి చెందిన డ్యూనలియాలా సలైనా(Dunaliella salina). ఆల్గే ఇతర జాతులు, బ్యాక్టీరియా కూడా ఈ చెరువుల్లో ఉన్నప్పటికీ గులాబీ వర్ణం రావడానికి అవేవీ దోహదపడవు. సోడియం క్లోరైడ్(NaCl-లవణం)గాఢత 35% ఉన్నా డ్యూనలియాలా సలైనా ఆల్గే బతకగలదు. సముద్ర జలాల్లో NaCl 3 శాతమే ఉంటుంది. ఉప్పదనం, ఉష్ణోగ్రతలు, వెలుతురు వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఆల్గే.. బీటా కెరొటీన్ అనే రెడ్ కెరటొనాయిడ్ పిగ్మెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. చెరువులు పింక్ కలర్‌లోకి మారడానికి ఇదే కారణం.


వాతావరణ మార్పుల కారణంగా లవణ గాఢతను తట్టుకోగలిగే హాలో బ్యాక్టీరియా పలు చెరువుల్లో కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక ఉప్పదనం, ఉష్ణ‌జలాలు వంటివి ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు సరైన వాతావరణం కల్పిస్తాయని వివరించారు. క్లైమేట్ ఛేంజ్ వల్ల ఆస్ట్రేలియా నైరుతి ప్రాంతంలో వర్షపాతం తగ్గిపోయి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో చెరువుల్లోని నీరు కూడా మార్పులకు లోనై.. మరింత ఉప్పదనాన్ని సంతరించుకుంటున్నాయని చెబుతున్నారు. ఫలితంగా చెరువులు పింక్ గా మారుతున్నాయి.

వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే కొద్దీ పింక్ లేక్స్ మరింత పింక్ గా మారడం లేదంటే ఎండిపోవడం జరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పింక్ లేక్స్ ఆస్ట్రేలియాలోనే కాదు.. పలు ఇతర దేశాల్లోనూ కానవస్తాయి. ప్రపంచం మొత్తం మీద 29 పింక్ లేక్స్ ఉన్నాయి. సెనెగల్‌, స్పెయిన్, కరీబియన్ దీవుల్లో ఈ చెరువులను చూడొచ్చు.

.

.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×