Jagan Angry: వైసీపీ హయంలో మద్యం స్కామ్‌పై చంద్రబాబు ప్రభుత్వం సిట్ వేసింది. దీనిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాట్లాడే అవకాశముందని చాలా మంది నేతలు భావించారు. గురువారం ఉదయం మీడియా మందుకొచ్చిన జగన్, ఆ విషయాన్ని పక్కనబెట్టేశారు. ఆది నుంచి జగన్ స్పీచ్‌లో తడబాటు మొదలైంది.
ఎప్పటి మాదిరిగానే వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన స్కీములు, పథకాలు, పనుల గురించి స్పీచ్ మొదలుపెట్టారు. తాము తీసుకొచ్చిన రివర్స్ టెండర్ల విధానం గురించి చెప్పడం మొదలుపెట్టారు. వైసీపీ హయాంలో దేశంతో ఏపీ పోటీపడిందన్నారు. ఐదేళ్లలో దేశం జీడీపీ 9.3 అయితే, ఏపీ 10.23 తో మెరుగ్గా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వం అంతా రాష్ట్ర కోసమే చేసిందని వివరించే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై మండిపడ్డారు. ఇసుక, బెల్టుషాపుల గురించి ప్రస్తావించారు జగన్. సూపర్ 6 లేదు.. సూపర్ 7 లేదంటూ ప్రస్తావించారు. చీటింగ్‌లో సీఎం చంద్రబాబు పీహెచ్‌డీ చేశారంటూ ఎద్దేవా చేశారు. ఆయన వ్యవహారశైలి వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఆవిరవుతోంది. చంద్రబాబు నటన ముందు ఎన్టీఆర్ కూడా పని చేయరని, ఆయనకు అవార్డు ఇవ్వాల్సిందేనన్నారు.
ఎన్నికల సమయంలో ఇవన్నీ చెప్పానని గుర్తు చేశారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో నోరు పెట్టడమేనన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనన్నారు. ప్రభుత్వం ఏర్పడి కొత్తగా ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. 2 లక్షల పైగా వాలంటీర్లను తొలగించారని వెల్లడించారు.
ALSO READ: వైసీపీ మద్యం కుంభకోణం.. రంగంలోకి సిట్, తాడేపల్లిలో ఫైల్స్ దగ్దం!
గ్రామ, వార్డు సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దేస్తున్నారని తెలిపారు. ఆర్థిక విధ్వంసం ఎవరిదో ఒక్కసారి చూడాలన్నారు. 9 నెలల్లో రాజధాని అమరావతి పేరిట చేసిన అప్పులు చేయబోతున్న అప్పులు కలిసి లక్షా 45 వేల కోట్ల రూపాయల పైమాటేనన్నారు. నిజంగా ఇదొక రికార్డుగా వర్ణించారు. ఈ ఏడు నెలల కాలంలో నెగిటివ్ గ్రోత్ రేటు వచ్చిందన్నారు.
గతంలో సీఎం చంద్రబాబు దావోస్‌కి వెళ్లినప్పుడు చెప్పిన మాటలను పేపర్ కటింగులను చూపించారు. అబద్దాలు, మోసాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకొచ్చారు జగన్. ఈసారి దావోస్‌కు వెళ్లినప్పుడు ఒక్క ఎంవోయూ జరగలేదన్నారు.
పెట్టుబడులు పెడతామని జిందాల్ లాంటి సంస్థలు వస్తే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారని అన్నారు జగన్. వారిపై కేసులు పెట్టి భయపెట్టారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రీసెంట్‌గా విశాఖలో ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేసినవన్నీ వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులేనని చెప్పే ప్రయత్నం చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు విలువైన ప్రాజెక్టులు వచ్చాయని, సీఎం చంద్రబాబు ఏం చేశారంటూ దుయ్యబట్టారు. ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారంటూ దుయ్యబట్టారు. కావాల్సిన మెడికల్ సీట్లు ఇస్తామని కేంద్రం చెబుతున్నా, అవసరం లేదని లేఖ రావడం విధ్వంసం కాదా అంటూ రుసరుసలాడారు. కేవలం 9 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ధ్వంసాల గురించి వివరించారు. అదే సమయంలో వైసీపీ పథకాలు గురించి వివరించే ప్రయత్నం చేశారు.
తొమ్మిది నెలల కాలంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు?: వైఎస్ జగన్
ఇచ్చిన ఉద్యోగాల కన్నా తొలగించినవే ఎక్కువ
చంద్రబాబు వాలంటీర్లను ఎలా మోసం చేశాడో అందరికీ తెలుసు
– వైఎస్ జగన్ pic.twitter.com/oOQmXmDDEi
— BIG TV Breaking News (@bigtvtelugu) February 6, 2025