BigTV English

SIT On Liquor Scam: వైసీపీ మద్యం కుంభకోణం.. రంగంలోకి సిట్, తాడేపల్లిలో ఫైల్స్ దగ్దం!

SIT On Liquor Scam: వైసీపీ మద్యం కుంభకోణం.. రంగంలోకి సిట్, తాడేపల్లిలో ఫైల్స్ దగ్దం!

SIT On Liquor Scam: ఏపీలో రాజకీయాలు జగన్ చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్ మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి ఏదో ఒక చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ కోసం సిట్‌ని నియమించింది చంద్రబాబు సర్కార్. దీనిపై రాత్రికి ఉత్తర్వులు రావడం, అర్థరాత్రి సమయంలో తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. దీంతో తాడేపల్లిలో ఏదో జరుగుతోందన్న అనుమానం వ్యక్తం చేసింది టీడీపీ.


వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగినట్టు నిర్థారణకు వచ్చింది కూటమి ప్రభుత్వం. పెద్దిరెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్రని సీఐడీ దర్యాప్తు తేలింది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు, ముడుపుల చెల్లింపులకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడటం వంటి ప్రధాన ఆరోపణలు. ప్రభుత్వానికి కీలక విషయాలు తెలియగానే వెంటనే సిట్ వేసింది. దీనికి సంబంధించి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బృందానికి విజయవాడ పోలీసు కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు (ఐజీ ర్యాంకు) నేతృత్వం వహించనున్నారు.

దర్యాప్తు బృందం సీఐడీ చీఫ్‌ ద్వారా రెండువారాల కొకసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. సిట్‌లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్‌, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ శివాజీ ఉన్నారు.


మద్యం కుంభకోణంపై సిట్ వేసిన విషయం తెలియగానే వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. అందులో ప్రమేయమున్న నేతలకు చెమటలు పట్టాయి. మరి ఏం జరిగిందో తెలీదు. అర్థరాత్రి సమయంలో మాజీ సీఎం జగన్ ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. దీనిపై టీడీపీ ఆసక్తికరమైన డౌట్ వ్యక్తం చేసింది.

‘లిక్కర్ స్కామ్‌లో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది’. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని ప్రశ్నించింది. సిట్ తన ఇంటికి వస్తుందని తెలిసి ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా అంటూ ప్రశ్నలు రైజ్ చేసింది.

ALSO READ: జగన్ ఇంటి సమీపంలో అగ్నిజ్వాలలు.. ఇది ఎవరి పని?

బుధవారం సాయంత్రం ఘటన జరిగితే, ఇప్పటివరకు తన ఇంటి ముందున్న సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు? తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే 2.0 అంటే ఇదేనా? అంటూ కొత్త ప్రశ్నలు రైజ్ చేసింది. ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు.. కచ్చితంగా సిట్ వస్తుంది.. విచారణ చేస్తుంది, మీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ.. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్’ అని ఎక్స్ లో రాసుకొచ్చింది.

గత ప్రభుత్వంలో సీఎంఓలో పని చేసిన ఓ వ్యక్తి లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన ఫైల్స్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంచినట్టు కొందరు టీడీపీ నేతల మాట. ఈ వ్యవహారాన్ని ప్రైవేటుగా మెయిన్‌టైన్ చేశారట. ఈ క్రమంలో డాక్యుమెంట్లు, డైరీలను అగ్నిప్రమాదం మాటున తగలబెట్టేశారని అంటున్నారు.

వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు ఆన్‌లైన్‌లో జరిగింది చాలా తక్కువ. మొత్తమంతా క్యాష్ రూపంలో మందుబాబుల నుంచి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో వైట్ పేపర్ రూపంలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వివరించారు కూడా.

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×