E-Paper
Advertisement

YSRCP : జగనూ .. ఇదేం తిరకాసు!

YSRCP : జగనూ .. ఇదేం తిరకాసు!
Advertisement

కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. లోక్‌సభలో నలుగురు.. రాజ్యసభలో ఐదుగురు ఎంపీలు ఉన్నారు. అయితే, మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు వైసీపీని కోరారు. అందుకు వైసీపీ స్పందించింది. ప్రతిపక్ష నేత జగన్ నేరుగా స్పందించకుండా ఆ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డితో తన మనసులోని మాటను బయటపెట్టించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అప్పట్లో ఎన్డీయే కూటమికి మద్దతుగా వ్యవహరించింది. నాడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు మద్దతు పలికింది.

మహిళా రిజర్వేషన్‌కు ఓకే..

2023లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రం నారీ వంధన్ శక్తి బిల్లును తీసుకొచ్చింది. గతంలో కాంగ్రెస్ హయాంలో మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెచ్చిన బిల్లుకు కేంద్రంలోని మోడీ సర్కారు పేరు మార్చింది.మూడేండ్ల కిందట కేబినెట్ ఆమోదం తెలిపిన నారీ వంధన్ అధినియం శక్తి బిల్లును తాజాగా కేంద్రం మంత్రి అర్జున్ మేఘావల్ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాలు కోరిన డివిజన్ కారణంగా ఓటింగ్ నిర్వహణకు ఆదేశించారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ బిల్లు మీద ఓటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.ఇవాళ, రేపు సాయంత్రం వరకు ఈ బిల్లు మీద చర్చ జరగనుంది.అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

డీలిమిటేషన్‌పై కిరికిరి..

Advertisement

నియోజకవర్గాల పునర్భిభజన అంశంపై వైసీపీ కేంద్రానికి కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎటువంటి షరతులు లేకుండానే మద్దతు ఇస్తామని చెప్పిన ఎంపీ మిథున్ రెడ్డి.. డీలిమిటేషన్ కోసం మాత్రం తమ షరతులకు అంగీకరించాలని ఫిట్టింగ్ పెట్టినట్టు పేర్కొన్నారు. జగన మహిళా పక్షపాతి అని అందుకే ఆ బిల్లుకు మద్దతు ఇస్తామని అన్నారు.ఇక డీలిమిటేషన్‌లో మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌కు నష్టం వాటిల్లే సూచనలు కనిపిస్తే బిల్లుకు మద్దతు ఇవ్వబోమని, వ్యతిరేకిస్తామని చెప్పారు. ఉత్తరాదితో పాటే ఏపీ,మిగతా సౌత్ స్టేట్స్ లోనూ 50 శాతం సమానంగా సీట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. తమ కండిషన్లకు కేంద్రం ఒప్పుకుంటేనే డీలిమిటేషన్ బిల్లు ముందుకు వెళ్తుందని సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.

 

Advertisement

CBN : దక్షిణాది కోసం శిష్యుడి ఫైట్.. గురువు మద్దతు ఎవరికి?

వైసీపీ తీరుపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దేశమంతటా 50 శాతం సీట్లు పెంచితే అందరికీ సమానంగా సీట్లు పెరుగుతాయి కదా? ఎందుకు డీలిమిటేషన్‌కు మద్దత ఇవ్వబోమని చెబుతున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఎంపీ సీట్లు ఎక్కువగా ఉండేవని..అప్పుడు 42 సీట్లు ఉండగా అందులో 50 శాతం అనగా 21 స్థానాలు కొత్తగా పెరుగుతాయని.. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినా తెలంగాణలో ప్రస్తుతం 17 ఎంపీ స్థానాలు.. ఏపీలో 25ఎంపీ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 28 ఎంపీ స్థానాలు అవుతుండగా.. ఏపీలో మొత్తం 38 ఎంపీ స్థానాలు పెరుగుతాయని గుర్తుచేస్తున్నారు.జనాభా ప్రాతిపదికన చూస్తే దక్షిణాదికి అన్యాయం జరగడం వాస్తవమే అని.. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంచడం మంచి విషయమే కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.కాగా, యూపీ, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, బిహార్, చత్తీస్ గఢ్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పెరిగే స్థానాల కంటే సౌత్ స్టేట్స్‌లో ఎంపీ స్థానాలు తక్కువగా పెరుగుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×