E-Paper
Advertisement

సీఎం చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్.. మరోసారి చావుపై ప్రస్తావన, ఆ పేరెత్తితే ఆయన పనైపోయినట్టే

సీఎం చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్.. మరోసారి చావుపై ప్రస్తావన, ఆ పేరెత్తితే ఆయన పనైపోయినట్టే
Advertisement

Amaravati: దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. మీడియాలో హైలైట్ కావాలనే.. ఏంటో తెలీదుగానీ సీఎం చంద్రబాబుపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మావిగన్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

నెల రోజుల తర్వాత మీడియా ముందు జగన్

Advertisement

దాదాపు నెల రోజుల తర్వాత మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ సీఎం. గతంలో మాదిరిగా ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో హంగమా చేసిన ‘మావిగన్’ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు జగన్.

మావిగన్ పేరు ఎత్తిన సీఎం చంద్రబాబు బీపీ పెరుగుతోందని, పొరపాటున ఎవరైనా నిద్రలో ఆయన ముందు ‘మావిగన్’ అంటే చాలని, బహుశా ఆయన గుండె ఆగి చనిపోయినా చనిపోతారని వ్యాఖ్యానించారు. అందుకే ఆ పేరు ఎత్తితే ఆయనకు బీపీ పెరుగుతోందన్నారు. ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు అడగాలని మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేశారు.

Advertisement

మరోసారి సీఎం చంద్రబాబు చావుపై ప్రస్తావన

ఆయన గుండె ఆగిపోకుండా ఉంటే అదృష్టమని, ఈ విషయంలో మీ మీద బ్లాస్ట్ చేయకుండా ఉంటే చాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టమన్నారు.  గతంలో చంద్రబాబుపై ఈ  తరహాలో వ్యాఖ్యలు చేశారు జగన్. అప్పుడు మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు అదే విధంగా వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా వైసీపీ పవర్‌లోకి రాదని భావించి అలా అన్నారా?  అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారా? అంటూ సోషల్ మీడియాలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయినా తోటి నాయకుడిపై ఆ విధంగా మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రికి తగదని అంటున్నారు.

ALSO READ: రూటు మార్చిన సీఎం చంద్రబాబు.. చేపలు వండి, మత్స్యకారుడి ఇంట్లో చేపల భోజనం 

గతంలో చాలామంది రాజకీయ నేతలను చూశామని, ఏ ఒక్కరూ మరణాల గురించి కోరుకోలేదని, బహుశా అలాంటి నేత ఈయనే కావచ్చని అంటున్నారు.  మొత్తానికి ఏదో మాట్లాడాలని వచ్చి మీడియాకు మరోసారి మసాలా ఇచ్చేశారు మాజీ సీఎం. ఇప్పటికే మావిగన్ విషయంలో వైసీపీ నేతలు  సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యారు.  ఇప్పుడు మళ్లీ అలాంటి ఛాన్స్ ఇచ్చేశారాయన.

 

 

Related News

ఏఐ డాక్టర్‌తో వైద్యసేవలు.. ఇంటి వద్దే 42 వైద్య పరీక్షలు.. ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్!

జగన్ ‘మావిగన్’ డ్రామా.. కామెడీ పీస్ అంటూ కేశినేని చిన్ని ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారుగా!

రాహుల్‌గాంధీ బాటలో విజయసాయిరెడ్డి.. ఐడియా అదుర్స్, ఏపీ సమయం ఆసన్నమైందంటూ

కడప నడిబొడ్డున జగన్‌పై లోకేష్ మాస్ ర్యాగింగ్.. ఉత్తరాలు, కలలు వద్దు భయ్యా, ఇంతకీ ఏం జరిగింది?

జగన్‌కు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్.. వివేకాను గొడ్డలితో చంపిందెవరు? ఎగిరెగిరి పడుతున్న ఆ నేత ఎవరు?

ప్రొ. నాగేశ్వరరావు ఇష్యూ.. సీపీఐ నారాయణ రియాక్ట్, అదే జరిగితే కాక్రోచ్‌లంతా బయటకు

ప్రొ. నాగేశ్వరరావుకు నాగబాబు కౌంటర్.. వ్యక్తిత్వ హననమా? విశ్లేషణ పేరుతో తప్పుడు ప్రచారమా?

Amaravati: గొడ్డలి పార్టీ ఇష్యూ.. సీఎం చంద్రబాబుపై జగన్ ఎదురుదాడి, మా తాత, నాన్న, చిన్నాన్న ఏం చేశారు?

Big Stories

Advertisement
×