E-Paper
Advertisement

కడప నడిబొడ్డున జగన్‌పై లోకేష్ మాస్ ర్యాగింగ్.. ఉత్తరాలు, కలలు వద్దు భయ్యా, ఇంతకీ ఏం జరిగింది?

కడప నడిబొడ్డున జగన్‌పై లోకేష్ మాస్ ర్యాగింగ్.. ఉత్తరాలు, కలలు వద్దు భయ్యా, ఇంతకీ ఏం జరిగింది?
Advertisement

Kadapa: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి ప్రత్యర్థులకు మసాలా ఇచ్చేస్తున్నారు. ఫలితంగా నేతలు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. తాజాగా గురువారం మీడియా సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఊహించని విధంగా కౌంటరిచ్చారు మంత్రి లోకేష్. శుక్రవారం సభలో ఓ రేంజ్‌లో మాస్ ర్యాగింగ్ చేశారు. గొడ్డలి మీ బ్రాండ్ అంటూ మరోసారి మాస్ ర్యాగింగ్ చేశారు.

కడప నడిబొడ్డున జగన్‌పై లోకేష్ మాస్ ర్యాగింగ్

Advertisement

శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండూరు గ్రామంలో రూ.3,000 కోట్లతో నిర్మించిన సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్-SAEL కంపెనీకి సంబంధించి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరయ్యారు. ప్రాజెక్టు ప్రారంభం కావడమంటే కేవలం రిబ్బన్ కటింగ్ కాదన్నారు.

నమ్మకం, వేగం, కార్య నిర్వహణల కలయిక అని మంత్రి నారా లోకేష్ అన్నారు. తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో స్థానిక రైతులు, స్థానిక యువత విజయమన్నారు. మీ అందరి సహకారం వల్ల ఈ ప్రాజెక్టు కేవలం 11 నెలల్లో పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. జమ్మలమడుగు వైపు రాష్ట్రమంతా చూస్తోందన్నారు.

Advertisement

ఉత్తరాలు, కలలు వద్దు భయ్యా,  గొడ్డలి మీ బ్రాండ్ అంటూ మరోసారి

ఈ ప్రాంతానికి మెగా సోలార్ పార్క్, అదానీ, చింతా గ్రీన్, జెన్‌కో-ఎన్టీపీసీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతోపాటు ఎస్ఏఈఎల్ చేరిపోయిందన్నారు. కంపెనీలు తేవాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా అది సీబీఎన్‌కే సాధ్యమన్నారు. అదే సమయంలో మాజీ సీఎం జగన్ గురించి కొన్ని ముత్యాల లాంటి మాటలు చెప్పారు.

మా నాన్న ఉత్తర రాశారు.. మా తాత కలలు కన్నారు.. రాత్రి ఆత్మలతో మాట్లాడటం వల్ల పరిశ్రమలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే ఓ ఎమ్మెల్యే మన జిల్లాలో ఉన్నారని వివరించారు. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా అంటూ తనదైన శైలిలో మాస్ ర్యాగింగ్ చేశారు.

ALSO READ: జగన్‌కు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్.. వివేకాను గొడ్డలితో చంపిందెవరు? ఎగిరెగిరి పడుతున్న ఆ నేత ఎవరు?

తన యువగళం పాదయాత్ర ఎక్కువ రోజులు రాయలసీమలో జరిగిందన్నారు. ఆ ప్రాంత రైతులు పడుతున్న కష్టాలు, కుటుంబాలతో మాట్లాడానని అన్నారు. ఇక్కడకు వచ్చేముందు కొంతమంది రైతులతో మాట్లాడానని గుర్తు చేశారు. హార్టికల్చర్‌ను పెద్ద ఎత్తున రాయలసీమలో ప్రొత్సహించాలని సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని వివరించారు. తనకు ఎప్పుడైనా డౌట్ వస్తే ఒక్క క్షణం ఆలోచిస్తానని, తన యువగళం బుక్ తెరిచి చదువుతానని, ఆ సమయంలో తనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందన్నారు. ఎందుకంటే మీరు తనను నడిపించారని వివరించారు మంత్రి లోకేష్.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×