Kadapa: ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. నేతల మరణాలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో వైసీపీకి పలు ప్రశ్నలు సంధించారు. వివేకానందరెడ్డిని గొడ్డలితో చంపిందెవరని సూటిగా ప్రశ్నించారు.
జగన్‌కు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
కడప జిల్లాలో పర్యటిస్తున్నారు టీడీపీ ఉపాధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్. గురువారం సాయంత్రం కడపకు చేరుకున్న ఆయన, ఎయిర్ పోర్టులో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, వైసీపీ గొడ్డలి పార్టీ కాకపోతే మరేంటని జగన్‌ను ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన కాస్త ఫీలైనట్టు కనిపిస్తోందన్నారు.
వివేకానందరెడ్డిని గొడ్డలితో చంపిందెవరంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. తొలుత గుండెపోటు అన్నారని, ఆ తర్వాత గొడ్డలి వేటు బయటకు వచ్చిందన్నారు. అందుకే వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టామని అన్నారు. అదే సమయంలో మరి కొన్ని విషయాలు బయటపెట్టారు. సొంత తల్లి, చెల్లిని తరిమేశారని అన్నారు.
వివేకాను గొడ్డలితో చంపిందెవరు?- లోకేష్ ప్రశ్న
రప్పా రప్పా అన్నది ఎవరని ప్రశ్నించారు మంత్రి లోకేష్. జగన్ సినిమా చూపిస్తే.. ఎండ్ కార్డు వేసే బాధ్యత మా కేడరదని అన్నారు. జగన్ సినిమాల్లోకి వస్తే భాస్కర్ అవార్డు వస్తుందని, అంత అద్భుతంగా నటిస్తున్నారని ఎద్దేశా చేశారు. బయట ముద్దులు పెడతారని, లోపల చిన్నాన్నను లోపేశారని అన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు ‘బెంతా హై’ అనే పేరు పెట్టారు. బెంగళూరులో మూడు రోజులు, తాడేపల్లి ఒక్కరోజు, హైదరాబాద్ మరో మూడు రోజులు ఉంటారని చెప్పకనే చెప్పారు.
పులివెందుల నియోజకవర్గాన్ని కాకుండా సొంత జిల్లాను జగన్ మోసం చేశారని ఆరోపించారు. జగన్‌ని రాయలసీమ ముద్ద బిడ్డ కాదు.. రాయలసీమకు క్యాన్సర్ గడ్డగా వర్ణించారు. 2019 నాటి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. దేవుడి గడపలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మనం అప్రమత్తం కావాలని శ్రేణులకు అలర్ట్ చేశారు.
ALSO READ: ప్రొ. నాగేశ్వరరావు ఇష్యూ.. సీపీఐ నారాయణ రియాక్ట్, అదే జరిగితే కాక్రోచ్‌లంతా బయటకు
రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరిని జగన్ మేనమామ చంపించి, మాపై కేసు పెడతామని బెదిరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కడపలో ఒక పెద్దాయన ఎగిరెగిరి పడుతున్నారని, త్వరలో ఆయనకు సమయం వస్తుందన్నారు. అప్పుడు ఆయన్ని ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. దీంతో ఎవరు ఆ పెద్దాయన అంటూ చర్చించుకోవడం మొదలైంది.
కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి.. అందరూ అప్రమత్తంగా ఉండాలి.. టీడీపీ శ్రేణులకు మంత్రి నారా లోకేశ్ సూచన pic.twitter.com/dXuTAio0p4
— ChotaNews App (@ChotaNewsApp) May 22, 2026