Jagan: ప్రతిష్టాత్మకమైన లండన్‌లో కింగ్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది మాజీ సీఎం జగన్ కుమార్తె వర్షారెడ్డి. డిస్టింక్షన్‌లో కూతురు పాస్ కావడంతో ఆ తల్లిదండ్రులు ఆనందంలో ఉబ్బితబ్బిబయ్యారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటను మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా బయటపెట్టారు. మమ్మల్ని గర్వపడేలా వర్ష చేసిందని పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా అభినందలు తెలియజేశారు.
ప్రపంచంలో ఫేమస్సయిన కాలేజీల్లో లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఒకటి. అందులో ఫైనాన్స్ విభాగంలో పట్టా అందుకుంది వర్ష. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రస్తావించారు జగన్. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోను షేర్ చేశారు మాజీ సీఎం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
వర్ష స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు న్యాయస్థానం అనుమతితో జగన్ తన భార్యతో కలిసి ఐదు రోజుల కిందట లండన్ వెళ్లారు. జనవరి నెలాఖరులో జగన్ తిరిగి విజయవాడకు రానున్నారు.
ఇక జగన్ పెద్ద కూతురు హర్షరెడ్డికి అద్భుతమైన రికార్డు ఉంది. 2017లో ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేరింది. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ (UG) పూర్తి చేసింది. ఆ తర్వాత యూఎస్‌లోని ఓ ఫైనాన్షియల్ కంపెనీలో ఆమె చేరిన విషయం తెల్సిందే.
ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజీ లండన్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన వైఎస్ జగన్ కుమార్తె వర్షారెడ్డి
'X' వేదికగా అభినందలు తెలియజేసిన మాజీ సీఎం వైఎస్ జగన్
డిస్టింక్షన్ లో పాస్ కావడం మమ్మల్ని గర్వపడేలా చేసిందని పోస్ట్ pic.twitter.com/7JmVlsfnyX
— BIG TV Breaking News (@bigtvtelugu) January 17, 2025