BCCI Rules-Team India: టీమ్ ఇండియా ఆటగాళ్లకు ( Teamindia Players) బీసీసీఐ ( BCCI ) బిగ్ షాక్ ఇచ్చింది. టీమిండియాలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది బీసీసీఐ పాలక మండలి ( Board of Control for Cricket in India). 2009 కంటే ముందు ఉన్న కఠిన రూల్స్ ( Rules ) తీసుకొచ్చింది. టీమ్ ఇండియా ఆటగాళ్లకు 10 కొత్త రూల్స్ పెట్టింది బీసీసీఐ. టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకుంది. టీమిండియా గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) కోచ్ పదవి చేపట్టిన తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిన టీమ్ ఇండియా…వరుసగా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది.
Also Read: Chandrababu – Nitish Kumar Reddy: సీఎం చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్…రూ. 25 లక్షల చెక్ అందజేత
టీమిండియా జట్టులోకి వచ్చిన జూనియర్లు పర్వాలేదనిపించినా సీనియర్ ఆటగాళ్లు మాత్రం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలోనే…10 కొత్త రూల్స్ తీసుకువచ్చింద బీసీసీఐ. ఇకపై ఆటగాళ్ళు తన వ్యక్తిగత సిబ్బంది తో ట్రావెల్ చేయకూడదని నిబంధన పెట్టింది బీసీసీఐ పాలక మండలి. పర్సనల్ వంటమనిషి, హెయిర్ డ్రెస్సర్, స్టైలిష్ట్, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో మ్యాచ్ టూర్ లకు రావొద్దని నిబంధనలు అమలు చేయనుంది. టీమ్ ఇండియా ప్లేయర్లు డొమెస్టిక్ మ్యాచ్ లు తప్పనిసరి గా ఆడాలని తెలిపింది.
టీమ్ తో పాటే ట్రావెల్ చేయాలని… వ్యక్తిగత సిబ్బంది కి అనుమతి లేదని వివరించింది. టూర్ లో వెంట కుటుంబ సభ్యులు వస్తే.. వాళ్ళతో సస్పెండ్ చేసేందుకు టైం లిమిట్ ఉంటుందని పేర్కొంది. బీసీసీఐ ( Board of Control for Cricket in India) షూట్ లో మాత్రమే పాల్గొనాలని… వ్యక్తిగత షూట్స్ చేయకూడదని ఆదేశించింది బీసీసీఐ పాలక మండలి ( Board of Control for Cricket in India).. ప్రాక్టీస్ టైం మొత్తం ఉండాలని… మధ్య లో వెళ్ళిపోవడానికి కుదరదని వార్నింగ్ ఇచ్చింది. లగేజీ 150 కిలోలకు మించి ఉంటే…బిసిసిఐ అదనపు ఛార్జీలను భరించదని తెలిపింది. ప్లేయర్లె చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. గంభీర్ ( Gambhir ) మేనేజర్.. గౌరవ్ ఆరోరాపైనా ఆంక్షలు పెట్టింది.
Also Read: Mumbai Cricket Association: వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు.. గ్రౌండ్ స్టాఫ్ కి MCA అదిరిపోయే గిఫ్ట్స్
స్టేడియంలో వీఐపీ బాక్సులో కూర్చునేందుకు అనుమతి నిరాకరించింది. టీమ్ బస్సులో ప్రయాణించేందుకు కూడా అనుమతి లేదని… వ్యక్తిగతంగా రావాల్సిందేనని వివరించింది. ప్లేయర్ల తోపాటు వెంట వచ్చే భార్య, కుటుంబ సభ్యులపైనా ఆంక్షలు విధించింది బీసీసీఐ. 45 లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు జరిగే టోర్నమెంట్స్‌లలో క్రికెటర్లతో కలిసి వారి భార్యాపిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ కేవలం 14 రోజులు మాత్రమే ఉండాలని తెలిపింది. టోర్నీ మొత్తం క్రికెటర్లతో కలిసి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉండటానికి వీలు లేదని వార్నింగ్ ఇచ్చింది. 15 నుంచి 20 రోజుల పాటు జరిగే టూర్స్ ఐతే… క్రికెటర్లతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ 7 రోజులు మాత్రమే కలిసి ఉండాలని స్పష్టం చేసింది. ఈ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందేనని హెచ్చరించింది బీసీసీఐ పాలక మండలి ( Board of Control for Cricket in India).
📢 THE BCCI RELEASES 10 NEW GUIDELINES FOR INDIAN PLAYERS. pic.twitter.com/5SXoPOrjz0
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 16, 2025