E-Paper
Advertisement

SIR ప్రక్రియపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై రుసరుస, మావిగన్ గురించి ఏం చెప్పారంటే

SIR ప్రక్రియపై జగన్ సంచలన వ్యాఖ్యలు..  ప్రభుత్వంపై రుసరుస, మావిగన్ గురించి ఏం చెప్పారంటే
Advertisement

Amaravati: ఎట్టకేలకు చాన్నాళ్ల తర్వాత మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. ఈసారి ప్రభుత్వంపై కొత్త ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ఓటమి ఖాయమని తేల్చేశారు. అందుకోసమే వైసీపీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారని కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

SIR ప్రక్రియపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

దాదాపు రెండువారాల గ్యాప్ తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఓడిపోతోందంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. అందుకు అనుగుణంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమం-సర్ ని తనకు అనుకూలంగా మార్చుకునే అధికార ప్రభుత్వం పడిందని ఆరోపించారు.

వైసీపీకి సానుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఆర్డీవోలతో స్వయంగా మాట్లాడారని కొత్త విషయాలు బయటపెట్టారు. ఎన్యూమరేషన్ ఫామ్‌లు ఇవ్వకుండా BLOలే వాటిని ఫిల్ చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓట్లు తొలగిస్తే, వారికి పథకాలు ఎలా వస్తాయంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.

Advertisement

ప్రభుత్వంపై రుసరుస, వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగింపు 

ఓట్లు తొలగిస్తే వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అవుతారని, చివరకు సిటిజన్ షిప్ లేకుండా చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇలా చేయడం ధర్మమేనా? ఓటరు అనేవాడు ఓటరని, చేతనమైతే మంచి చేసి మనసు గెలుచుకోవాలన్నారు. ఓటు వేయరని చెప్పి జాబితా నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఓట్లు తొలగిస్తే నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని, మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వం ఓట్లు తొలగించిందని చెప్పడంపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఎలాగూ ఎన్నికల్లో గెలవదని తెలిసి, ఇప్పటి నుంచి జగన్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారని అంటున్నారు.

ALSO READ: తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నారా? కొడుక్కి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు, కోర్టు సమర్థన

చంద్రబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఆయన సీఎంగా తన బాధ్యతలు చేస్తున్నారా? రైతులను గాలికి వదిలేసి, ఆయన చేస్తున్న పాలన ఏంటి? అవినీతి, దోపిడీ, రెడ్ బుక్ నడుస్తోందన్నారు.చంద్రబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఆయన సీఎంగా తన బాధ్యతలు చేస్తున్నారా?

రైతులను గాలికి వదిలేసి, ఆయన చేస్తున్న పాలన ఏంటి? అవినీతి, దోపిడీ, రెడ్ బుక్ నడుస్తోందన్నారు. చివరలో మీడియా మిత్రలు వైజాగ్ రాజధాని కథ మావిగన్‌తో ముగిసినట్టేనా? వచ్చే ఎన్నికల నాటికి అమరావతి vs మానిగన్ గా మారుతుందన్నారు. అమరావతికి మద్దతు ఇస్తే టీడీపీకి ఓటు వేయాలని, మానిగన్‌కు మద్దతు ఇస్తే వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేయాలన్నారు. మరి విశాఖపట్నం మాటేంటి అంటే చెప్పకుండా వెళ్లిపోయారు. అన్న ప్రశ్నకు బదులు ఇవ్వకుండా ముసిముసిగా నవ్వుతు అక్కడి నుంచి వెళ్లిపోయారు మాజీ సీఎం జగన్.

 

Related News

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

చోడవరంలో దారుణం.. భర్తను నరికి చంపి, తల వద్ద దీపం పెట్టిన భార్య!

గుండెల్లో బలమైన అజెండా ఉండాలి.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

తిరుపతి స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత.. అప్రమత్తమైన కలెక్టర్, ఎస్పీ!

ఏపీలో మెగా DSC అక్రమాల సెగ.. నలుగురు టీచర్లు సస్పెండ్!

చంద్రబాబు ప్రభుత్వంపై బొత్స ఘాటు వ్యాఖ్యలు.. మళ్లీ బ్రిటీష్ పాలన తలపించేలా..

పెమ్మసాని ఫొటో మార్ఫింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంబటికి హైకోర్టు సమన్లు!

వ్యక్తిగత దూషణలు చేయవద్దు.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×