E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మార్కెట్‌ను షేక్ ఆడిస్తున్న ‘RGB’ టీవీలు.. ఇంట్లోనే IMAX రేంజ్ విజువల్స్.. కళ్లు చెదిరే క్లారిటీ!

మార్కెట్‌ను షేక్ ఆడిస్తున్న ‘RGB’ టీవీలు.. ఇంట్లోనే IMAX రేంజ్ విజువల్స్.. కళ్లు చెదిరే క్లారిటీ!
Advertisement

RGB TV 2026: లాస్ వెగాస్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ ‘CES 2026’లో సరికొత్త టీవీల ప్రదర్శన టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా టెక్ ప్రపంచమంతా ఇప్పుడు ఒకే ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటోంది. అదే ‘ఆర్ జీబీ టీవీ’ (RGB TV). ఇప్పటికే 2026 ఏడాదిని టెక్ నిపుణులు ‘ఇయర్ ఆఫ్ ది ఆర్‌జీబీ టీవీ’ (Year of the RGB TV)గా అభివర్ణిస్తున్నారు. ఇంతకీ ఆర్‌జీబీ టీవీ అంటే ఏంటి? ఈ ఏడాది మార్కెట్లోకి వస్తున్న ఇతర అద్భుతమైన టీవీలు ఏవి? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆర్‌జీబీ టీవీ అంటే?

ఎల్‌ఈడీ లేదా మినీ-ఎల్‌ఈడీ టీవీల బ్యాక్‌లైట్ కోసం సాధారణంగా తెల్లటి లేదా నీలి రంగు ఎల్‌ఈడీలను వాడుతుంటారు. కానీ ఈ సరికొత్త ‘ఆర్‌జీబీ టీవీ’ టెక్నాలజీలో ఎల్‌సీడీ ప్యానెల్ వెనుక నేరుగా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల మైక్రోస్కోపిక్ ఎల్‌ఈడీలను (Microscopic LEDs) అమర్చుతారు. దీనివల్ల స్క్రీన్ పై వచ్చే ప్రతి రంగును విడివిడిగా అత్యంత క్లారిటీతో చూసేందుకు వీలు కలుగుతుంది. ఫలితంగా స్క్రీన్‌పై కనిపించే రంగులు అద్భుతమైన స్పష్టతతో సహజంగా, కంటికి ఇంపుగా కనిపిస్తాయి.

ఆర్‌జీబీ టీవీల హవా?

Advertisement

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రీమియం డిస్‌ప్లే టెక్నాలజీలైన OLED, MicroLED లతో నేరుగా పోటీ పడేందుకు ఈ ఆర్‌జీబీ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. శాంసంగ్, ఎల్‌జీ వంటి దిగ్గజ కంపెనీలు ఈ సరికొత్త ఆర్‌జీబీ బ్యాక్‌లైట్ టెక్నాలజీతో కూడిన టీవీలను ఈ ఏడాది పరిచయం కూడా చేశాయి. ఇవి అద్భుతమైన బ్రైట్‌నెస్ ఇవ్వడమే కాకుండా సాధారణ టీవీల కంటే ఎక్కువ కలర్ రేంజ్ అందిస్తాయి. అంటే మనం థియేటర్‌లో చూసే క్వాలిటీ కంటే మెరుగైన విజువల్స్ ఇంట్లోనే ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు.

CES 2026లో టాప్ టీవీలు

ఈ ఏడాది ఆర్‌జీబీ టీవీలు మాత్రమే కాకుండా.. మరికొన్ని అద్భుతమైన టీవీలు కూడా విడుదలయ్యాయి. శామ్‌సంగ్ 130-ఇంచ్ మైక్రో ఆర్‌జీబీ టీవీ (Samsung 130-inch Micro RGB TV).. ఈ ఏడాది సీఈఎస్ లో అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఈ భారీ టీవీ.. ఒక ఆర్ట్ గ్యాలరీ లాంటి డిజైన్‌తో, ‘మైక్రో ఆర్‌జీబీ ఏఐ ఇంజన్ ప్రో’ ప్రాసెసర్‌తో రూపొందింది. ఈ టీవీ అత్యంత ప్రీమియం అనుభూతిని యూజర్లకు అందిస్తుంది. 55 ఇంచుల నుండి 115 ఇంచుల సైజుల్లోనూ శాంసంగ్ ఆర్ జీబీ టీవీలను తీసుకువస్తోంది.

Advertisement

Also Read: సామాన్యుల స్పెషల్.. రూ.200లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. 2GB డేటా, ఫ్రీ కాల్స్, ఫన్ కంటెంట్!

LG OLED evo W6

ఎల్‌జీ కంపెనీ తన ఐకానిక్ వాల్‌పేపర్ టీవీ సిరీస్‌ను సరికొత్త ‘ప్రైమరీ ఆర్‌జీబీ టాండెమ్ 2.0’ ప్యానెల్‌తో మళ్లీ తీసుకొచ్చింది. ఇది గోడకు అద్దంలా అతుక్కుపోవడమే కాకుండా గత మోడళ్ల కంటే 20 శాతం ఎక్కువ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే ఎల్‌జీ కూడా తన సొంత ‘Micro RGB evo’ టీవీలను మార్కెట్లోకి తెచ్చింది. మరోవైపు చైనా దిగ్గజం టీసీఎల్ సైతం సీఎల్ ఎక్స్11ఎల్ ఎస్‌క్యూడీ-మినీ ఎల్‌ఈడీ టీవీని.. సీఈఎస్ – 2026లో ప్రదర్శించింది. ఇది ఏకంగా 10,000 నిట్స్ (Nits) గరిష్ట బ్రైట్‌నెస్‌తో.. అత్యంత వెలుతురు ఉన్న గదిలోనూ స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది.

Also Read: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన స్లీపర్ బస్సు.. 8 మంది మృతి!

Related News

వీఐ సరికొత్త ప్లాన్.. 6 నెలల వ్యాలిడిటీ.. 1800GB డేటా, అపరిమిత కాల్స్!

ఒకే చెట్టు.. 300 ఏళ్లపాటు కలప.. 600 ఏళ్ల నాటి అద్భుత టెక్నాలజీ!

తక్కువ బడ్జెట్‌లో హోమ్ థియేటర్ మజా.. అమెజాన్‌లో బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

సామాన్యుల స్పెషల్.. రూ.200లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. 2GB డేటా, ఫ్రీ కాల్స్, ఫన్ కంటెంట్!

ప్రొఫెషనల్ ఆడియో క్వాలిటీ.. ఈ 5 బెస్ట్ Jabra హెడ్‌ఫోన్స్‌పై ఓ లుక్కేయండి!

చిమ్నీలపై వేలల్లో డిస్కౌంట్? అమెజాన్ ప్రైమ్ డే సేల్ అస్సలు మిస్సవ్వొద్దు

రూ.20 వేల లోపే వన్‌ప్లస్ 5G మొబైల్.. మిలిటరీ గ్రేడ్ బాడీ, భారీ బ్యాటరీతో లాంచ్!

Big Stories

×