E-Paper
Advertisement

సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!

సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!
Advertisement

Samantha Host:మా ఇంటి బంగారంతో సాలిడ్ హిట్ కొట్టి వంద కోట్ల క్లబ్ లో కూర్చున్న సమంత ఇపుడు మరో అవతారం ఎత్తబోతుంది. అవును..ఇప్పటి వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లతో అలరించిన సామ్ ఇప్పుడు ఈసారి ఏకంగా వంటల షోకు హోస్ట్‌గా చేయబోతుంది.

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’కు సామ్ హోస్ట్

Advertisement

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ కార్యక్రమానికి సమంత యాంకర్‌గా వ్యవహరించనున్నారు. దీంతో ఈ షోపై ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది.సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా శనివారం ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది .

అంతేకాదు.. సమంతతో చేసిన షో ప్రోమోను కూడా రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమం సోనీ లివ్ తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే షో ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని మాత్రం మేకర్స్ ఇంకా చెప్పలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని వెల్లడించారు.

Advertisement

సెలబ్రిటీలు వంటగదిలోకి!

ఇక ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’లో తమిళ సినిమా, టీవీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు. సాధారణంగా కెమెరా ముందు నటించే వాళ్లు ఈసారి వంటగదిలోకి వెళ్లి తమ టాలెంట్ చూపించాలి. అందులోనూ మామూలు వంటలు చేస్తే సరిపోదు. షోలో ఇచ్చే టాస్క్‌లను టైమ్‌లో పూర్తి చేసి.. జడ్జిలను తమ వంటకాలతో మెప్పించాలన్న మాట

వంట రాకపోతే సెలబ్రిటీల పరిస్థితి ఏంటి?

ఎవరికి వంట బాగా వచ్చు? ఎవరు అసలు వంటగదిలో అడుగు కూడా పెట్టరు? ఎవరు కొత్త ప్రయోగాలు చేస్తారు? ఎవరి వంట అద్భుతంగా ఉంటుంది? వంటి సీన్లతో ఈ షో బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వనుందని తెలుస్తుంది.

ముఖ్యంగా షూటింగ్స్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలు వంట చేయడానికి ఇబ్బంది పడే సీన్స్ ఈ షోలో బోలెడు ఉండబోతున్నాయన్న మాట.ఇక ఈ షోకు హోస్ట్‌గా అవకాశం రావడంపై సమంత మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఇలాంటి షో చేయలేదని అందుకే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పానని తెలిపారు. ఈ షోలో సెలబ్రిటీలను ప్రేక్షకులు మరో కోణంలో చూడొచ్చని ,వంట చేసే సమయంలో వాళ్లు చేసే చిన్న చిన్న తప్పులు, కొత్తగా ట్రై చేసే వంటకాలు, చివరి నిమిషంలో తీసుకునే రిస్కులు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని చెప్పుకొచ్చింది .

సమంతకు కూడా కొత్త ఎక్స్‌పీరియన్స్‌నే!

ఇప్పటివరకు సమంతను మనం హీరోయిన్‌గా, యాక్షన్ పాత్రల్లో, ఎమోషనల్ క్యారెక్టర్లలో చూశాం. కానీ యాంకర్ గా ఎలా అదరగొడుతుందో ఈ షోలో చూడబోతున్నాం. సెలబ్రిటీలతో సరదాగా మాట్లాడుతూ.. వాళ్లను టీజ్ చేస్తూ.. టాస్క్‌ల సమయంలో హుషారుగా నడిపిస్తూ సమంత ఎలా షోను ముందుకు తీసుకెళ్తారనేది ఇక్కడ ఆసక్తికరం.

ఇక సమంత ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన కెరీర్‌ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది.

also read:సంక్రాంతికి స్టార్ హీరోల జాతర.. థియేటర్లు సరిపోతాయా గురూ?

యాంకర్‌గా సామ్ ఎలా ఉంటుందో?

2025లో ‘శుభం’ సినిమాతో నిర్మాతగా కొత్త ప్రయత్నం చేసింది. ఇక మా ఇంటి బంగారంతో ఏకంగా వంద కోట్లు వెనకేసింది .ఇప్పుడు హోస్ట్‌గా మరో కొత్త ప్రయోగం చేస్తుంది.. ఒక స్టార్ హీరోయిన్ కుకింగ్ షోకు హోస్ట్‌గా మారడం సాధారణ విషయం కాదు. అందుకే ఈ షోపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి.చూడాలి మరి సామ్ తన యాక్టింగ్ టాలెంట్ ని యాంకరింగ్ లో ఎలా చూపిస్తుందో !

Tags

Related News

వారణాసి కోసం పోటీ పడుతున్న బడా నిర్మాతలు?

జీవితంలో అప్పు చెయ్యని హీరో ఎవరో తెలుసా..?

అంజలికి పెళ్లి ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్

నాగ్ అశ్విన్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

ఆ క్షణం ఒంటరిని అనిపించింది..ఎమోషనల్ అయిన తారక్!

అవార్డు వేడుకకు పింక్ చీరలో వచ్చిన నిహారిక.. వెనుక అసలు కథ ఇదే!

అదే నడక.. అదే స్వాగ్.. యమదొంగను గుర్తు చేసిన తారక్!

సినిమా మీద సినిమా.. ఫలితం మాత్రం అదే! కయాదు కష్టాలు కంటిన్యూ

Big Stories

Advertisement
×