E-Paper
Advertisement

రూ.30 వేల ఫోన్.. చైనాలో రూ.15 వేలే ఎందుకు? మనం ఎక్కువ ఇస్తున్నామా?

రూ.30 వేల ఫోన్.. చైనాలో రూ.15 వేలే ఎందుకు? మనం ఎక్కువ ఇస్తున్నామా?
Advertisement

China Smartphone Prices: ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మంచి ఫోన్ కొనాలంటే రూ.30 వేల నుంచి ఒక్కొసారి రూ.లక్షకుపైగా ఖర్చు చేయాల్సిందే. అయితే భారత్ వంటి దేశాల్లో మెుబైల్స్ ధరలు ఎక్కువగా ఉంటే.. చైనాలో మాత్రం చాలా చౌకగా అవి లభిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దానికి వెనుక ఉన్న ప్రధాన కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం.

రవాణా ఖర్చు లేకపోవడం..

చైనా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కేంద్రాలలో ఒకటి. షావోమి, వివో, ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఫోన్లను అక్కడ నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. కాబట్టి ఉత్పత్తులను తయారు చేసిన దేశంలోనే విక్రయించడం వల్ల అంతర్జాతీయ షిప్పింగ్ ఛార్జీలు, ఎగుమతి, దిగుమతి సుంకాలు, సుదూర ప్రాంతాలకు అయ్యే లాజిస్టిక్స్ ఖర్చుల భారం వాటిపై ఉండదు. దీనివల్ల చైనీస్ కంపెనీలు.. తమ పౌరులకు తక్కువ ధరకే ఫోన్లను విక్రయించేందుకు ఆస్కారం ఏర్పడుతోంది.

బలమైన సప్లై చైన్, భారీ ఉత్పత్తి

Advertisement

దీనికి తోడు ఎలక్ట్రానిక్స్ రంగానికి అవసరమైన అత్యంత అభివృద్ధి చెందిన సప్లై చైన్ వ్యవస్థ చైనాలో ఉంది. డిస్‌ప్లేలు, బ్యాటరీలు, కెమెరాలు, ప్రొసెసర్‌ల వంటి విడిభాగాలన్నీ అక్కడే సులభంగా లభిస్తాయి. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా తయారీ వేగం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఒక ఫోన్ తయారీకి అయ్యే సగటు వ్యయాన్ని కంపెనీలు గణనీయంగా తగ్గించగలుగుతున్నాయి.

కంపెనీల మధ్య హోరాహోరీ పోటీ

టాప్ మెుబైల్ కంపెనీలన్నీ చైనాలో ఉండటంతో అక్కడి మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొంది. స్థానిక బ్రాండ్లు ఒకదానికొకటి పోటీపడుతూ అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఫోన్లను తక్కువ ధరలకే మార్కెట్లోకి తెస్తున్నాయి. దీనికితోడు యాపిల్, శాంసంగ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా అక్కడి మార్కెట్లో ఉండటంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి చైనీస్ కంపెనీ తరచూ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇది అక్కడి వినియోగదారులకు ఎంతో మేలు చేస్తోంది.

Advertisement

Also Read: రైల్వే చరిత్రలో ఫస్ట్ టైమ్.. కూల్ డ్రింక్ పేరుతో నడిచే రైలు.. ఇదేదో భలే ఉందే!

విదేశాలతో పోలిస్తే ధర వ్యత్యాసం

చైనాలో విక్రయించే స్థానిక బ్రాండ్ల మెుబైల్స్ ధరలు.. ఇతర దేశాల్లో విక్రయించే వాటి కంటే దాదాపు 30% నుండి 50% వరకు తక్కువగా ఉంటాయి. అయితే విదేశీ బ్రాండ్స్ అయిన ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ మోడళ్ల ధరలు మాత్రం.. గ్లోబల్ మార్కెట్లో ఉన్నట్లుగానే చైనాలో ఖరీదుగా ఉంటాయి. మెుత్తం మీద ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడంలో చైనా పాటిస్తున్న పక్కా వ్యూహాలు, కలిసి వస్తున్న పరిస్థితులు.. అక్కడ స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకు లభించడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

Also Read: స్టీరింగ్ గేర్ వైఫల్యం.. తీరానికి దూసుకొచ్చిన భారీ నౌక.. ఒడ్డున ఉన్నోళ్లు పరుగో పరుగు!

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×